‘బతుకు బస్టాండ్’ చిత్ర వీడియో గ్లింప్స్ కి అనూహ్య స్పందన..

848

విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న సినిమా బతుకు బస్టాండ్. నికిత అరోరా, శృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇలవల ఫిల్మ్స్ పతాకంపై చక్రధర్ రెడ్డి సమర్పణలో IN రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా బతుకు బస్టాండ్ టీమ్ విడుదల చేసిన ట్రిబ్యూట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. . ఈ సినిమాను కవితా రెడ్డి, కె.మాధవి నిర్మిస్తున్నారు. అలానే తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. హీరో విరాన్, హీరోయిన్ నికిత అరోరా ఇద్దరు చాలా రొమాంటిక్ గా చేతులు పట్టుకుని కూర్చున్నారు. ఈ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా థీమ్ ని పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో విశేష స్పందన తెచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. థ్రిల్లింగ్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు దర్శకుడు IN రెడ్డి.

ఈ సినిమాకు వాస్ కమల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మహవీర్ సంగీతం సమకూరుస్తున్నారు. జూన్ 11న ‘బతుకు బస్టాండ్’ సినిమా విడుదల కానుంది. ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియోను విడుదల చేస్తున్నారు

నటీనటులు:
విరాన్ ముత్తంశెట్టి, నికిత అరోరా, శృతి శెట్టి తదితరులు

టెక్నికల్ టీం:
బ్యానర్ : ఇలవల ఫిల్మ్స్
సమర్పణ : K చక్రధర్ రెడ్డి
రచన, దర్శకత్వం : I.N. రెడ్డి
నిర్మాతలు : I.కవితా రెడ్డి, K.మాధవి
DOP : వాస్ కమల్
సంగీతం : మహవీర్
Pro : ఏలూరు శ్రీను & మేఘ శ్యామ్
కొరియోగ్రఫీ : శివాజీ
యాక్షన్ : శంకర్.U

PRO;ELURU SEENU