ఉగాది సందర్భంగా ‘‘ఏక్ లవ్ యా’’ మూవీ నుండి ‘కాలాన్ని మరచి’ సాంగ్ రిలీజ్

388

హీరోయిన్ రక్షిత నిర్మాతగా మారి…తన తమ్ముడు రానా ను హీరోగా పరియచం చేస్తూ నాలుగు భాషల్లో నిర్మించిన సినిమా ‘‘ఏక్ లవ్ యా’’. ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కించారు. ‘‘ఏక్ లవ్ యా’’ మూవీకి రక్షిత భర్త, కన్నడ స్టార్ డైరెక్టర్ జోగి ప్రేమ్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన తొలి పాట సూపర్ హిట్ అయ్యింది. 5 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఇక ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా ‘‘ఏక్ లవ్ యా’’ మూవీ నుండి ‘కాలాన్ని మరచి’ అని సాగే సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేసింది టీమ్. ఈ పాటను దర్శకుడు ప్రేమ్ పాడటం విశేషం. లవ్ మెలొడీస్ ను ఇష్టపడే వారికి ‘కాలాన్ని మరచి’ పాట బాగా నచ్చుతుంది. ‘‘ఏక్ లవ్ యా’’ త్వరలో నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది.

నటీనటులు రానా, రీష్మ, రచితా రామ్. సాంకేతిక వర్గం: నిర్మాణం: రక్షిత ఫిలిం ఫ్యాక్టరీ, మ్యూజిక్: అర్జున్ జాన్య, నిర్మాత: రక్షిత, రచన,దర్శకత్వం: జోగి ప్రేమ్.

           GSK MEDI

SRINIVAS -SURESH-KUMAR

94408 41952
            9618881927
            9666455059