`ఈగిల్ ఐ` ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై మ‌రో చిత్రానికి స‌న్నాహాలు!

372

న‌రేన్  వ‌న‌ప‌ర్తి హీరోగా ప‌రిచ‌యం అవుతూ రూపొందిన `ఊరికి ఉత్త‌రాన‌` చిత్రం ఇటీవ‌ల విడుద‌లై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.  ఇటు విమ‌ర్శ‌కుల నుంచి  అటు ప్రేక్ష‌కుల నుంచి మంచి  ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ విజ‌యం ఇచ్చిన ఉత్సాహంతో ఈగిల్ ఐ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై  ప్రొడ‌క్ష‌న్ నెం-2గా మ‌రో చిత్రాన్ని రూపొందించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే ఈచిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా పూర్తి కావొచ్చింది.
ఈ సంద‌ర్భంగా  హీరో , చిత్ర  స‌మ‌ర్ప‌కులు న‌రేన్ వ‌న‌ప‌ర్తి మాట్లాడుతూ… మా“ఊరికి ఉత్త‌రాన‌` చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించారు.  విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ల‌భించాయి. కొత్తవారైనా కంటెంట్ ఉంటే సినిమాను ఆద‌రిస్తార‌ని మా చిత్రం మ‌రోసారి నిరూపించింది.  `ఊరికి ఉత్త‌రాన‌` స‌క్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో  ఈగిల్ ఐ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా మ‌రో చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన  టైటిల్ తో పాటు కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.