నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. `సింహా`, `లెజెండ్` వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా రూపొందనుంది. నందమూరి బాలకృష్ణ కోసం దర్శకుడు బోయపాటి శ్రీను మరో పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేశారు.
కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రస్తుతం సమాజంలోని ప్రధానమైన సమస్య ఆధారంగా చేసుకుని బోయపాటి శ్రీను అద్భుతమైన కథను సిద్ధం చేశారు. డిసెంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2020 వేసవి చివరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇది వరకు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో బాలకృష్ణ పవర్ఫుల్ లుక్స్ అందరినీ మెప్పించాయి. అలాంటి మరో పవర్ఫుల్ లుక్‌లో బాలకృష్ణ చూపించనున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్యాషనేట్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.3గా అన్ కాంప్రమైజ్డ్గా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను చిత్ర యూనిట్ ప్రకటిస్తుంది