‘డ్రేప్స్ అండ్ డిజైన్స్ స్టోర్‌’ను ప్రారంభించిన రికార్డ్ బ్రేక్ టీం, కలియుగం పట్టణంలో టీం.

132

గృహోపకరమైన అన్ని వస్తువులను ఒకే చోటకు తీసుకు రావాలనే ఉద్దేశంతో డ్రేప్స్ అండ్ డిజైన్స్ స్టోర్‌ను మాదాపూర్‌లో ప్రారంభించారు. రాజ శేఖర్, జయ లక్ష్మీల స్టోర్‌ను రికార్డ్ బ్రేక్ టీం, కలియుగం పట్టణంలో టీం కలిసి ప్రారంభించింది. అనంతరం రెండు చిత్ర యూనిట్స్ అభినందనలు తెలిపారు.

నటి సత్య మాట్లాడుతూ.. ‘మా రికార్డ్ బ్రేక్ సినిమా టీం ఈ డ్రేప్స్ అండ్ డిజైన్ స్టోర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. మార్చి 8న మా చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను వీక్షించండి’ అని అన్నారు.

రికార్డ్ బ్రేక్ హీరోయిన్ రగ్దల్ ఫక్తర్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి స్టోర్‌ను హైద్రాబాద్‌లో మొదటి సారిగా లాంచ్ చేశారు. ఈ స్టోర్‌లో అన్నీ అద్భుతంగా ఉన్నాయి. త్వరలోనే రాబోతోన్న మా మూవీని అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

విశ్వ కార్తికేయ మాట్లాడుతూ.. ‘కలియుగం పట్టణంలో ప్రమోషన్స్‌లో భాగంగా మా హీరోయిన్ ఆయుషి పటేల్‌తో కలిసి ఇక్కడకు వచ్చాను. ఈ డ్రేప్స్ అండ్ డిజైన్ స్టోర్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. కలియుగం పట్టణంలో మార్చి 22న విడుదల చేయబోతోన్నామ’ని అన్నారు.

ఆయుషి పటేల్ మాట్లాడుతూ.. ‘ఈ డ్రేప్స్ అండ్ డిజైన్స్ స్టోర్‌ రూంలో ఇంటికి సరిపడే వస్తువులన్నీ అద్భుతంగా ఉన్నాయి. అందరూ స్టోర్‌ను విజిట్ చేయండి. మా కలియుగం పట్టణంలో సినిమా మార్చి 22న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

‘మాదాపూర్‌లో మా ఈ కొత్త డ్రేప్స్ అండ్ డిజైన్ స్టోర్‌ను ప్రారంభించడం ఆనందంగా వుంది. అందరూ వచ్చి చూడండి. మీ ఇంటికి కావలసిన ఇంటీరియర్ అన్ని వర్గాల వారికి అనువైన ధరలొ లేటెస్ట్ రకాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. మా స్టోర్‌ను ప్రారంభించిన రికార్డ్ బ్రేక్ టీం, కలియుగం పట్టణంలో టీంకు థాంక్స్’ అని సాత్విక, శశి అన్నారు.

P.Rambabu
cinejosh.com
9848 123 007