యాక్షన్, రీవేంజ్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “రుద్ర సింహ” షూటింగ్ పూర్తి

427

KM ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్. స్నేహ, మైత్రి, హీరో, హీరోయిన్లు గా మనోహర్ కాటేపోగు దర్శకత్వంలో మనోహర్ కాటేపోగు, ధరగయ్య బింగి, ఆంజనేయులు నంధవరం, కోటేశ్వర్ రావు జింకల లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న యాక్షన్, రీవేంజ్ డ్రామా చిత్రం “రుద్ర సింహ”.ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొంది.త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మనోహర్ కాటేపోగు, ధరగయ్య బింగి, ఆంజనేయులు నంధవరం, కోటేశ్వర్ రావు జింకల మాట్లాడుతూ…ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం.మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ ,రివెంజ్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో వస్తున్న ఈ సినిమాలో ఏడు పాటలు, ఐదు ఫైట్స్ ఉన్నాయి. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు అందరూ కూడా కచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఎంతో థ్రిల్ ఫీల్ అవుతారు.ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ చాలా చక్కగా కుదిరారు. వారంతా సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కథతో వస్తున్న దర్శకుడు మనోహర్ కాటేపోగు ఫ్యూచర్ లో పెద్ద దర్శకుడు అవుతాడు.ఈ సినిమాకు రాజేష్ రాజ్ టి మంచి మ్యూజిక్ ఇచ్చాడు.ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు.

నటీనటులు
హీరో. సంతోష్
హీరోయిన్స్. స్నేహ, మైత్రి, నాధవరం ఆంజనేయులు, జింకల కోటేశ్వర్ రావు, బింగి ధరగయ్య, తుమ్మేటి శ్రీ హరి, జింకల రవి కుమార్, రమణి, ప్రసాద్,కృష్ణా రెడ్డి, రవికుమార్ తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : KM ఫిల్మ్ ప్రొడక్షన్స్
నిర్మాతలు : మనోహర్ కాటేపోగు, ధరగయ్య బింగి, ఆంజనేయులు నంధవరం, కోటేశ్వర్ రావు జింకల
దర్శకుడు : మనోహర్ కాటేపోగు
డి. ఓ.పి : ఉదయ్ కుమార్ జి
సాహిత్యం : మనోహర్ కాటేపోగు
సంగీతం : రాజేష్ రాజ్ టి
ఎడిటర్స్ : ప్రేమ్ స్నాప్స్, మణి
రైటర్ : బ్యూలా రాణి కె
కో డైరెక్టర్ : షాలెం రాజ్ కె


RK.Chowdary PRO 9848623335