HomeCeleb Interviewsఅందరూ రిలేట్ అవ్వగలిగే చిత్రం 'డర్టీ హరి' - హీరో శ్రవణ్ రెడ్డి

అందరూ రిలేట్ అవ్వగలిగే చిత్రం ‘డర్టీ హరి’ – హీరో శ్రవణ్ రెడ్డి

ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో శ్రవణ్ రెడ్డి ని తెలుగులో హీరోగా పరిచయం చేస్తూ సస్పెన్స్ తో కూడిన రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. ఈ నెల 18న ఫ్రైడే మూవీస్ ATT యాప్ పై ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మరియు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రత్ కౌర్, రుహాని శర్మలు ఇందులో హీరోయిన్లు గా నటించారు.

ఈ సందర్భంగా తన ముంబై, బాలీవుడ్ ప్రస్థానం గురించి చెబుతూ అదే సమయంలో విలేఖరుల ప్రశ్నలకి బదులిస్తూ హీరో శ్రవణ్ రెడ్డి ఇలా అన్నారు..

స్టోరీ వినగానే మీ మొదటి రియాక్షన్ ఏంటి ?

చాలా ఆశ్చర్యపోయా. రాజు గారి సినిమాలు చూస్తూ ఆ గ్రాండ్యుర్, ఆ ఫామిలీ జానర్ చిత్రాలకి పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక్కడు, వర్షం లాంటి కమెర్షియల్ కథ ఉంటుందని ఊహించుకుని వెళ్లిన నాకు, నేటి తరానికి రిలేట్ అయ్యే కథతో ఇంప్రెస్ అయిపోయా. క్యారెక్టర్స్ అన్ని చాలా రిలేట్ అయ్యేలా ఉన్నాయి. మహిళల సెంటిమెంట్ చాలా క్లాసిగా చూపించారు.

యూత్ కి కనెక్ట్ అయ్యేలా చాలా బోల్డ్ గా ఉన్నట్లనిపించింది, కానీ చిత్రంలో అది అందరికీ నచ్చుతుందా?

మీరు చిత్రం చూసాక ఈ మాటే అనరు. నేను కథ విన్నపుడు కూడా ఆ రొమాన్స్ కథలో భాగంగానే ఉన్నట్లనిపించింది, కావాలని పెట్టినట్టు అనిపివ్వలేదు. ఆయన కథని నమ్మి నేను ఒప్పుకున్నాను అలాగే ఎక్కడ ఇబ్బంది పడలేదు. మీక్కూడా కచ్చితంగా అదే అనిపిస్తుంది.

కానీ ట్రైలర్ & పాటతో అలాగే తీసుకెళుతున్నట్టు అనిపిస్తుంది ?

హీరోని హీరోలాగా రాముడి లాగా చూపించకుండా, రాముడికి రావణుడికి మధ్యన ఉండే గ్రే వ్యక్తిత్వాన్ని గట్స్ తో రియలిస్టిక్ గా చూపించాలనుకున్నారు. ఒక ఏజ్ గ్రూప్ లో వారికి అలా అనిపించొచ్చేమో కానీ, 40 ఏళ్ళు దాటి కూడా యూత్ ఫుల్ గా ఆలోచించేవాళ్ళు కూడా ఉంటారు. అలా అందరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది.

రియల్ లైఫ్ లో మీ వ్యక్తిత్వానికి డర్టీ హరి రోల్ కి పోలికలున్నాయా ?

రాజు గారు స్టోరీ చెబుతున్నపుడు & షూట్ చేసేటపుడు 30 -35 % రిలేట్ అవుతాను ఈ భావోద్వేగాలకు రోల్ కి అనిపించింది. మిగితాదంతా ఆయన గైడెన్స్ & కొంత హోమ్ వర్క్ కూడా బాగా పనికొచ్చింది.

బోల్డ్ సీన్స్ చేసేటపుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా ?

బోల్డ్ సీన్స్ మాత్రమే కాదు కార్ నడుపుతున్నప్పుడు షూట్ చేయడం లాంటివాటిలో కూడా కొంచం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కానీ బాగా వచ్చింది.

భావాలు పండించడానికి ఎన్ని టేక్స్ తీసుకున్నారు?

ఇది చేయడమే మేము చిత్రం 3/4 శాతం చేసాక పెట్టుకున్నాము. అప్పటికే ఉన్న కో-ఆర్డినేషన్ తో త్వరగానే అయిపోయింది. స్టోరీలో ముఖ్యమైన ఒక్క సీన్ మాత్రమే రెండు సార్లు రెండు రోజులు చేసాం.

డర్టీ హరి క్యారెక్టర్ చాలా డర్టీ గా ఉంటుందంటున్నారు ?

క్యారెక్టర్ ని ఎలా ఉందో అలాగే చూపిద్దాం, ఏ మాత్రం కూడా మార్చక్కర్లేదు, మనం ఎలా చూస్తున్నామో ప్రేక్షకులకి కూడా అలాగే చూపిద్దాం అనుకున్నారు రాజు గారు.

రొమాన్స్ ఎంత శాతం ఉండొచ్చు ?

చాలా తక్కువే, చిత్రంలో అదొక్కటే ముఖ్యంగా ఉండదు. మనం కావాలన్నది దొరికాక అనిమలిస్టిక్ ఇన్స్టింక్ట్ మొదలయ్యాక ఏమవుతుందో, యూత్ తెలిసి తెలియక చేసి కష్టాలు తెచుకున్నాక ఎం జరుగుతుందో ఉంటుంది. ప్రేమ, ఆకర్షణ, పెళ్లి అని సినిమాటిక్ గా కాకుండా నిజంగా ఎలా ఉంటుందో అలాగే, అంతే చూపించారు.

తెలుగులో మొదటి చిత్రమే ఇలాంటిది చేస్తే నెగటివ్ అనిపిస్తుందనిపివ్వలేదా?

నాకున్న అవకాశాల్లో నాకు నచ్చింది & ఎం.ఎస్.రాజు గారి కథ మీద నమ్మంతో చేసానంతే.

ఈ చిత్రం తరువాత మీకు ఆర్టిస్టుగా మంచి పేరొస్తుందని నమ్మకంగా ఉన్నారా ?

అవునండి, ఆ నమ్మకంతోనే చిత్రం చేసాను.

ఇంకేమైనా చిత్రాలు చేస్తున్నారా ?

అనుకున్న టైం కి రిలీజ్ అవుతే ఇంకొక చిత్రం చేసేవాడిని ఇక్కడే. హిందీలో ఒక ముఖ్య వేదికపై వెబ్ సిరీస్ చేస్తున్నా.

ఈ చిత్రం పోస్టర్స్ కోసం వేరే చిత్రం రెఫెరెన్స్ గా తీసుకున్నారా?

ఉండుండొచ్చు అన్ని, రాజు గారు చెప్పిన వాటినుండే తీసుకున్నారు ఉంటాయి. పోస్టర్స్ కోసం సెపరేట్ గా షూట్ ఏం జరగలేదు. చిత్రంలో ఉన్న కొన్ని ఫ్రేమ్స్ నుండే తీసేసుకున్నారు, ఏవ్ చాలనుకున్నారు.

బాలీవుడ్ లో ఇలాంటి వాటికి ఇమ్రాన్ హష్మీ ఉన్నట్టు మీరు   ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా?

ఎవరికైనా కొద్దో గొప్పో అలాంటి అనుభవాలుండడం సహజమే. అలాంటివి చేసేటపుడు మనకు తెలీకుండానే ఆ ఆలోచనల ప్రభావం కూడా ఉండుండొచ్చు.

చిత్రం ఏ.టి.టి లో విడుదల చేయడం చిత్ర ఫలితం పై ప్రభావం చూపిస్తుందనుకుంటున్నారా?

బన్నీ వాసు గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యున్నారంటే మీరు ఆలోచించొచ్చు, ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అవి ఎంత సక్సెస్ అవుతాయని. థియేటర్ ఎక్స్పీరియన్స్ లోనే చూడాల్సిన చిత్రమిది. వీలైతే థియేటర్ ల లో కూడా విడుదల చేయాలనుకుంటున్నాం.

హీరోగానే చేయాలనుకుంటున్నారా ? మళ్ళీ ఇలాంటివే చేస్తారా?

హీరోగానే కాదు, మంచి చిత్రాల్లో ముఖ్యమైన రోల్స్ చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగే చేయాలని కాదు నచ్చితేనే ఏ రోల్ అయినా చేస్తాను నేను అంటున్నానండి.

ఈ చిత్రం తో కొత్తగా ఏమైనా నేర్చుకున్నారా?

రాజు గారికి సినిమాలపై ఉన్న ఇష్టం, ఆయన ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయా. చాలా స్ఫూర్తినిచ్చింది.

డైరెక్షన్ వైపు ప్రయత్నిద్దాం అనుకుంటున్నారా ?

నాకు స్క్రీన్ ప్లే రాయడం ఇష్టం. కథలు రాసి పెట్టుకున్నాను. సమయాన్ని బట్టి జరిగితే బాగుంటుంది అని కోరుకుంటున్నాను.

PRO :PULGAM Chinnarayana

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES