గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయిన డర్టీ ఫెలో

90

రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హిరో హీరోయిన్లుగా, మూర్తి సాయి అడారి డైరెక్షన్ లో, జీ శాంతి బాబు నిర్మిస్తున్న చిత్రం డర్టీ ఫెలో. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా హిరో శాంతి చంద్ర మాట్లాడుతూ; ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తొలి కాపీ తో రిలీజ్ కు రెడీ అయ్యింది. నెక్స్ట్ వీక్ లో టీజర్ ను ఓ ప్రముఖ హీరో రిలీజ్ చేయనున్నారు.అక్టోబర్ లో సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. దర్శకుడు మూర్తి సాయి ఏదైతే కధ మాకు చెప్పారో అది స్క్రీన్ మీద చూసినప్పుడు సినిమా మీద మరింత నమ్మకం కుదిరింది. మా అంచనాలకు మించి సక్సెస్ అవుతుందని భావిస్తున్నాము. నాసిక్ అరకు, వైజాగ్, హైదరాబాద్ లో సినిమా షూటింగ్ చేసాము. సంగీత దర్శకులు డాక్టర్ సతీష్ గారు ఇచ్చిన పాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఒక తండ్రి తనకొడుకునీ సరైన మార్గంలో పెట్టకపోతే ఆ కొడుకు విచ్చల విడిగా సమాజానికి హానికరంగా మారితే… ఆ తండ్రి తీసుకొనే నిర్ణయం ఏమిటి…తండ్రి కొడుకుల మధ్య జరిగే యాక్షన్ డ్రామా. హీరోయిన్స్ ఇద్దరు బాగా నటించారు. ఈ సినిమా లో నటించిన నటి నటులు టెక్నిషియన్స్ కు ధన్యవాదములు అని అన్నారు.

చిత్ర దర్శకుడు మోహన్ సాయి అడారి మాట్లాడుతూ: ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు మా కథలో వున్నాయి. హీరో శాంతి చంద్ర డాక్టర్ సతీష్ గారు సహకారం మరువలేను. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు మా సినిమాలో ఉన్నాయి. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు అని అన్నారు.

నటి నటులు: శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్ హిరో హీరోయిన్లుగా నటించగా సత్యప్రకాస్, నాగి నిడు, ఎఫ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, నిఖేష్, టి రవి తదితర ముఖ్య పాత్రల్లో నటించారు

ఎడిటర్: జేపీ
ఫైట్స్: శంకర్
మ్యూజిక్: డాక్టర్ సతీష్
డాన్స్; కపిల్ అండ్ ఈశ్వర్
సినిమాటోగ్రఫీ: ఎస్ రామకృష్ణ,
ప్రొడ్యూసర్; జీ శాంతిచంద్ర
డైరెక్టర్;. మూర్తి సాయి ఆడారి