HomeTeluguకలశ మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించిన స్టార్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ డిశంబర్ 15న...

కలశ మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించిన స్టార్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ డిశంబర్ 15న గ్రౌండ్ రిలీజ్

చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో బిగ్ బాస్ ఫెమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం కలశ. కొండా రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించారు.ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి సినిమా పై మరింత అంచనాలను పెంచింది. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ ఆవిష్కరించి చిత్ర యూనిట్ ను అభినందించారు.

ఈ సందర్భంగా దర్శకులు మలినేని గోపిచంద్ మాట్లాడుతూ : కలశ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా థ్రిల్లరా? లేక హర్రరా ? అనేది తెలీకుండా తెలివిగా కట్ చేశారు. కలశ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి డైరెక్ట్ చేసిన దర్శకుడు రాంబాబు కి నిర్మాత కు నటీనటులకు టెక్నీషియన్స్ కు అల్ ది బెస్ట్ డిశంబర్ 15 న రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి అని అన్నారు.

హీరోయిన్ భానుశ్రీ (బిగ్ బాస్ ఫేమ్): మాట్లాడుతూ: కలశ ట్రైలర్ ను డైరెక్టర్ మలినేని గోపిచంద్ గారు లాంచ్ చేశారు. థాంక్ యు సో మచ్ గోపిచంద్ గారు. డిశంబర్ 15 మా కలశ రిలీజ్ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి అని అన్నారు.

చిత్ర దర్శకుడు: కొండా రాంబాబు మాట్లాడుతూ: మా కలశ మూవీ ట్రైలర్ ను దర్శకులు మలినేని గోపిచంద్ గారు లాంచ్ చేసి మా టీం ను మెచ్చుకున్నారు. డిశంబర్ 15న రిలీజ్ అవుతుంది .అందరూ తప్పకుండా కలశ సినిమా ను చూడండి.

నిర్మాత: శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి మాట్లాడుతూ: స్టార్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని గారు మా కలశ ట్రైలర్ ను లాంచ్ చేశారు. డిశంబర్ 15 న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది మిస్ అవ్వకుండా సినిమా చూడండి అని అన్నారు.

హీరోయిన్ సోనాక్షి వర్మ మాట్లాడుతూ : కలశ మూవీ ట్రైలర్ ను డైరెక్టర్ మలినేని గోపిచంద్ గారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. డిశంబర్ 15న రీలీజ్ అవుతున్న కలశ సినిమాను ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించండి అని అన్నారు.

భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ గంగధారి, సంగీతం: విజయ్‌ కురాకుల, ఎడిటర్‌: జునైద్‌ సిద్దిఖీ, లిరిక్స్‌: సాగర్‌ నారాయణ, నిర్మాత: డాక్టర్‌ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి, దర్శకత్వం: కొండా రాంబాబు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES