డిఫరెంట్ మూవీగా తెరకెక్కుతోన్న ‘గేమ్ ఆన్’తప్పకుండా ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది: టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విశ్వ‌క్ సేన్‌

118

గీతానంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్‌’. ఏ క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ముఖ్య అతిథిగా హాజ‌రైన విశ్వ‌క్ సేన్‌ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో హీరో గీతానంద్‌, న‌టుడు ఆదిత్య మీన‌న్‌, ద‌ర్శ‌కుడు ద‌యానంద్‌, నిర్మాత ర‌వి క‌స్తూరి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ – అరుణ్‌, సినిమాటోగ్రాఫ‌ర్ అర‌వింద్ విశ్వ‌నాథ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా..

మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ అశ్విన్ – అరుణ్‌ మాట్లాడుతూ ‘‘ముందుగా హీరో గీతానంద్, దర్శకుడు దయానంద్, నిర్మాత రవిగారికి థాంక్స్. ఈ సినిమాలో ఓ రొమాంటిక్ ట్రాక్‌ను కంపోజ్ చేశాం. త్వ‌ర‌లోనే పాట‌లు విడుదల‌వుతాయి’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ నవాబ్ గ్యాంగ్ మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. దర్శకుడు సాంగ్స్‌ను కూడా డిఫ‌రెంట్‌గానే కావాల‌న్నారు. మంచి సాంగ్స్ కుదిరాయి’’ అన్నారు.

సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథన్ మాట్లాడుతూ ‘‘అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. సినిమా బాగా వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌స్తాం’’ అన్నారు.

నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ ‘‘గేమ్ ఆన్ సినిమాను ఓ పాపలాగా కేర్ తీసుకుని మరీ సినిమా చేశాం. టీజ‌ర్ రిలీజ్ చేశాం. మీ అందరికీ విజువ‌ల్స్ న‌చ్చాయ‌ని భావిస్తున్నాను. మూవీ ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ఆదిత్య మీన‌న్‌గారికి, విశ్వ‌క్‌కి స్పెష‌ల్ థాంక్స్’’ అన్నారు.

డైరెక్ట‌ర్ ద‌యానంద్ మాట్లాడుతూ ‘‘గేమ్ ఆన్ మూవీ జ‌ర్నీలో చాలా మంది స‌పోర్ట్ చేశారు. అందువ‌ల్లనే ఇక్క‌డ వ‌ర‌కు రాగ‌లిగాం. ఇది రెగ్యుల‌ర్ మూవీ అయితే కాదు. మా ప్రొడ్యూసర్ ర‌విగారు కూల్‌గా ఉంటూ స‌పోర్ట్ చేశారు. అర‌వింద్ విశ్వనాథన్ అద్భుతంగా విజువ‌ల్స్ ఇచ్చాడు. న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ప్రతీ ఒక్కరూ చ‌క్క‌గా స‌పోర్ట్ చేశారు. సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.ఇక్కడ మా మూవీ ఓ మార్క్ క్రియేట్ చేస్తుంద‌ని అనుకుంటున్నాను. ఈ జ‌ర్నీలో చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను. యాక్ష‌న్‌, రొమాన్స్ ఉంది. ఎమోష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి. యూనిట్ పాయింట్‌తో సినిమా తెర‌కెక్కింది. గీతానంద్‌, నేహా సూప‌ర్బ్‌గా పెర్ఫామ్ చేశారు. ఇక ఆదిత్య‌మీన‌న్‌గారు అందించిన స‌పోర్ట్‌కి థాంక్స్‌’’ అన్నారు.

ఆదిత్య మీన‌న్ మాట్లాడుతూ ‘‘ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాల్లో న‌టించాను. సినిమా చూడటంలో ఇప్పుడు ప్రేక్ష‌కుల అభిరుచి మారుతూ వ‌స్తుంది. డిఫ‌రెంట్ జోన‌ర్‌లో చాలా సినిమాలు వ‌స్తున్నాయి. స‌క్సెస్ అవుతున్నాయి. అలాంటి ఓ డిఫ‌రెంట్ జోన‌ర్‌లో చేసిన సినిమా గేమ్ ఆన్. మూవీ చాలా బాగా వ‌చ్చింది. ర‌విగారు ఆస్ట్రేలియా నుంచి వ‌చ్చి.. ఎక్కడా కాంప్ర‌మైజ్ కాకుండా మూవీని చేశారు. ప్రేక్ష‌కుల‌ను మెప్పించే సినిమా అవుతుంది’’ అన్నారు.

హీరో గీతానంద్ మాట్లాడుతూ ‘‘గేమ్ ఆన్ టీజ‌ర్ చూడ‌గానే విశ్వ‌క్ ఫోన్ చేసి టీజ‌ర్ లాంచ్ చేస్తాన‌ని అన్నారు. అందుకు తనకు స్పెషల్ థాంక్స్. ఈ సినిమా ఫలానా అని స్పెష‌ల్ లేబుల్స్ అని ఇవ్వ‌లేను. ఎందుకంటే ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ మూవీ. ఇన్‌టెన్స్ క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య జ‌రిగే ఎమోష‌న‌ల్ జ‌ర్నీ ఇది. లూజ‌ర్ క్యారెక్ట‌ర్ లైఫ్ అయిపోతున్న టైమ్‌లో త‌న లైఫ్‌లో గేమ్ స్టార్ట్ అవుతుంది. త‌న‌ని ఆ గేమ్ ఏ లెవ‌ల్‌కు తీసుకెళుతుంద‌నేదే క‌థ‌. డైరెక్ట‌ర్ ద‌యానంద్ నా త‌మ్ముడే. ఈ సినిమా స్క్రిప్ట్‌పై ఏడాదిన్న‌ర పాటు వ‌ర్క్ చేశాం. తెలుగులో ఇప్పుడు డిఫ‌రెంట్ సినిమాలు రావ‌ట‌మే కాదు.. స‌క్సెస్ అవుతున్నాయి. ఓ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ కోవ‌లోనే గేమ్ ఆన్ సినిమా ఉంటుంద‌ని భావిస్తున్నాను. చాలా ట్విస్టులు, ట‌ర్నులుంటాయి. మూవీలో గ్రే క్యారెక్ట‌ర్స్ మ‌న‌ల్ని ఆకట్టుకుంటాయి. నిర్మాత ర‌వి చాలా ప్యాష‌న్‌తో ఈ సినిమాను చేశారు. ప్ర‌తి ఫ్రేమ్ మిమ్మ‌ల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ‌తుంది. నేహా సోలంకి చాలా మంచి పాత్ర‌లో న‌టించింది. ఆదిత్య‌మీన‌న్‌గారు త‌న యాక్టింగ్‌తో త‌న పాత్ర‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్ల‌ట‌మే కాదు.. మా అంద‌రికీ స‌పోర్ట్‌గా నిలిచారు. ఆయ‌న‌తో పాటు మిగిలిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కి థాంక్స్’’ అన్నారు.

విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ ‘‘కొత్త వాళ్లను ఎంక‌రేజ్ చేయ‌టంలో టాలీవుడ్‌, తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ముందుంటారు. 2013 -14 టైమ్‌లో నేను, దయానంద్ అంద‌రం 5డీ కెమెరాలతో షార్ట్ ఫిలింస్ చేసి మా ఐడియాస్‌ను షేర్ చేసుకుంటుండేవాళ్లం. ఇప్పుడు త‌ను కూడా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు. గీతానంద్‌, ద‌యానంద్‌ల‌కు ఈ గేమ్ ఆన్ సినిమా చాలా పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాత ర‌వి కూడా మా కాలేజ్‌లోనే చ‌దివారు. గేమ్ ఆన్ టీజ‌ర్ చాలా బావుంది. రొటీన్ సినిమా అయితే కాదు. క‌చ్చితంగా థ్రిల్ అవుతారు. ’’ అన్నారు.

న‌టీన‌టులు:

గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, వాసంతి, కిరిటీ, శుభ‌లేక సుధాక‌ర్‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్స్‌: ఏ క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్‌, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌: ర‌వి క‌స్తూరి
ద‌ర్శ‌క‌త్వం: ద‌యానంద్‌
మ్యూజిక్‌: న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ – అరుణ్‌
సినిమాటోగ్రఫీ: అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌
డైలాగ్స్‌: విజ‌య్ కుమార్ సి.హెచ్‌
ఒరిజిన‌ల్ బ్యాగ్రౌండ్ స్కోర్‌: అభిషేక్ ఎ.ఆర్‌
ఎడిట‌ర్ : వంశీ అట్లూరి
ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్‌: దిలీప్ జాన్‌, రాజ్ క‌మ‌ల్‌
స్టంట్స్‌: రామ‌కృష్ణ‌న్‌, న‌భా స్టంట్స్‌
కాస్ట్యూమ్స్‌: మ‌నోజ్‌
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా