బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిన రూ. 8.30 కోట్ల విలువైన శంకుస్థాపన

533

రుద్రూరు మండలం సిద్దాపూర్, రాయకూర్ క్యాంపు, రాయకూర్ గ్రామాలలో ఈరోజు జరిగిన రూ. 8.30 కోట్ల
విలువైన శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు. రాయకూర్ క్యాంప్ లో జరిగిన కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు… పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారు, బోధన్ RDO, TRS పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు.

 *ఈసందర్భంగా జరిగిన గ్రామ సభలలో స్పీకర్ గారు మాట్లాడుతూ…* దేశంలో అత్యధిక మందికి, ఎక్కువ మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

రాష్ట్రంలో 42 లక్షల మంది ప్రజలకు ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. కరోనా ప్రభావంతో  రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనందున నూతన పెన్షన్లు ఇవ్వలేదు. వచ్చే మార్చి నుండి కొత్త పెన్షన్లు వస్తాయి. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇప్పటికే పది లక్షల మందికీ కళ్యాణలక్ష్మి‌, షాదీముబారక్ ల ద్వారా ఈ సహాయం అందింది. వ్యవసాయానికి పెట్టుబడిగా ఎకరాకు పదివేల రూపాయల చొప్పున రైతుబంధు సహాయంగా అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ. బాన్సువాడ నియోజకవర్గంలో 66,370 మంది రైతులు ఉన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఒక్కో సీజన్ కి ఆరవై కోట్ల చొప్పున ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలోకి వచ్చాయి.

బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు చనిపోయిన 1200 మంది రైతుల కుటుంబాలకు రైతుబీమా
ద్వారా అరవై కోట్ల రూపాయలు అందాయి. రైతు బీమా సహాయాన్ని వృధాగా ఖర్చు చేయవద్దు. ఆ నగదును కుటుంబ భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోవాలి. పేదలైనా, ధనికులైనా ఆత్మగౌరవం ఒక్కటే. అందుకే పేదల ఆత్మగౌరవం కాపాడటానికి డబుల్ బెడ్ రూం పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించారు. రాష్ట్రంలో పదివేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయిన ఏకైక నియోజకవర్గం బాన్సువాడ. ఇల్లు లేని పేదవారందరికి స్వంత ఇంటి కలను నిజం చేస్తాను. విడతల వారిగా పేదలందరికి డబుల్ బెడ్ రూం ఇంటిని మంజూరు చేస్తాను. అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్ళను మంజూరు చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వస్తున్నాయి. భవిష్యత్తులో ఇగ సాగునీటికి డోకా ఉండదు. పేదల ఇంటి ఫంక్షన్లకు ఎక్కువ ఖర్చు కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విదంగా నియోజకవర్గంలో 80 జనరల్ ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నాం. రాయకూర్ క్యాంప్ గ్రామ ముఖద్వారాన్ని స్వంత ఖర్చుతో నిర్మించిన రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై  గ్రామ స్థాయిలో సమగ్ర సమాచారంతో కూడిన ప్రొఫైల్ ఉండాలి.

 *మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూ..* ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం ఒక ఎత్తు అయితే ప్రజా సమస్యలను తీర్చడానికి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం ఒక ఎత్తు.

బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇంత పెద్ద ఎత్తున నిర్మించడం రికార్డు. పదివేల ఇళ్ళు నిర్మించడం అందరికీ సాద్యం కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం అనేది నాయకుల సమర్ధత‌‌, అపార అనుభవంతో మాత్రమే సాద్యం. పోచారం శీనన్న మాకు ఆదర్శం. తెలంగాణ రాష్ట్రంలో 360 స్కీంలు అమలు అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం రావడంతోనే ఇవన్నీ కళ్ళతో చూడగలుగుతున్నాం. గతంలో సాగునీరు, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడుల కోసం రైతులు తల్లడిల్లినారు. కేసీఆర్ గారు  ఆ సమస్యలను తొలగించి అసాద్యాన్ని సుసాధ్యం చేసారు.
రాష్ట్రం సాదించడమే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారు. ప్రభుత్వానికి ఉన్న పట్టుదల, చిత్తశుద్ధికి నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం. నా భార్య స్వగ్రామం అయిన రాయకూర్ క్యాంపులో గ్రామస్థులు కోరిక మేరకు గ్రామ ముఖద్వారం  నిర్మాణానికి సహాయం చేశాం.