HomeTelugu"డియర్ మేఘ" ఎక్స్ట్రార్డినరీ లవ్ స్టోరి - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు రామ్...

“డియర్ మేఘ” ఎక్స్ట్రార్డినరీ లవ్ స్టోరి – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ”డియర్ మేఘ”. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ ఎమోషనల్ ప్రేమ కథా చిత్రం సెప్టెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా ”డియర్ మేఘ” ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో వైభవంగ జరిగింది. ఈ సందర్భంగా

గీత రచయిత కృష్ణ కాంత్ మాట్లాడుతూ….”డియర్ మేఘ” సినిమాకు పనిచేసిన యూనిట్ అంతా ఫ్యామిలీ లాగా అయిపోయారు. ఈ సినిమాలోని ఐదు పాటలు దేనికది సందర్భానుసారం ఉంటాయి.   చిత్రానికి కూడా అలాగే థియేటర్ లలో ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ…”డియర్ మేఘ” విజువల్స్ చాలా కొత్తగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ గారికి కంగ్రాట్స్. గీత రచయిత కెకె గారు గొప్ప సాహిత్యాన్ని ఇచ్చారు. ఆయనతో నేను కూడా పనిచేశాను. అరుణ్ ఆదిత్ అన్నకు మంచి హిట్ రావాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఆయన చాలా ఫ్రెండ్లీ. ఆల్ ద బెస్ట్ టు అదిత్ అన్న. ఈ చిత్రాన్ని థియేటర్ లలో విడుదల చేసేందుకు ముందుకొచ్చిన నిర్మాత అర్జున్ దాస్యన్ గారికి థాంక్స్. పరిస్థితులు ఎలా ఉన్నా, సినిమాను థియేటర్ లో చూడాలని కోరుకునే అభిమానులెందరో వారందరి కోరికను నెరవేర్చారు. ”డియర్ మేఘ” చూశాక ఆడియెన్స్ మేఘా ఆకాష్ ను డియర్ మేఘా అని పిలుస్తారు. అన్నారు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ…”డియర్ మేఘ” సినిమా ఎక్స్ట్రార్డినరీ రొమాంటిక్ ఫిల్మ్. ఇలాంటి రొమాంటిక్ లవ్ స్టోరి ఈ మధ్య కాలంలో రాలేదు. హరి గౌర కంపోజ్ చేసిన పాటలు చాలా బాగున్నాయి. మెలొడీ సాంగ్స్ ను బాగా ఎంజాయ్ చేశాను. మేఘా ఆకాష్ 40 ఏళ్ల కిందట కనిపించి ఉంటే నాకు డివోర్స్ అయ్యేవి కావు. ఆమె చాలా క్యూట్, హోమ్లీ లుక్ లో ఉంది. నా సినిమాలకు సెట్ అవదు. అరుణ్ ఆదిత్ ను ఎక్కువ పొగిడితే నన్ను గే అనుకుంటారు. అతనితో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పను. ఎందుకంటే సినిమా గురించి నా ఫీలింగ్స్ ఆల్రెడీ చెప్పేశాను. అన్నారు.

హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ… నా పేరు మీద గతంలో ఓ పాట వచ్చింది. ఇప్పుడు ఓ సినిమా రూపొందడం అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ సుశాంత్ గారితో పనిచేయడం సంతోషంగా ఉంది. మేఘ స్వరూప్ క్యారెక్టర్ ను నాతో చేయించినందుకు థాంక్యూ. ఈ పాత్రలో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. అర్జున్ దాస్యన్ నా ఫేవరేట్ ప్రొడ్యూసర్. ఆయనను హ్యాపీ ప్రొడ్యూసర్ అని పిలవొచ్చు. తెలుగులో సినిమాలు చేశాను గానీ ఏ సినిమా టీమ్ కు ఇంత దగ్గర కాలేదు. వీళ్లు నా ఫ్యామిలీలా మారారు. ఈ టీమ్ తో మళ్లీ మళ్లీ పనిచేయాలని కోరుకుంటున్నా. అర్జున్ సోమయాజులుకు టాలీవుడ్ లోకి వెల్ కమ్ చెబుతున్నా. నా ఫ్రెండ్ అరుణ్ ఆదిత్ తో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. సెప్టెంబర్ 3న మా డియర్ మేఘ చిత్రాన్ని థియేటర్ లలో చూడండి. మంచి ఎమోషనల్ లవ్ స్టోరి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ…ఆర్జీవీ గారికి శ్రీదేవి గారితో పనిచేయడం ఎంత కిక్ ఇచ్చిందో, నాకు మేఘా ఆకాష్ తో పనిచేయడం అంతే కిక్ ఇచ్చింది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో స్నేహా ఉల్లాల్, డార్లింగ్ లో కాజల్ ఇంట్రడక్షన్ చూసే ఉంటారు. మా చిత్రంలో మేఘా ఆకాష్ ఇంట్రడక్షన్ సీన్ చూస్తే అవి మర్చిపోతారు. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ గారు అంత బాగా పిక్చరైజ్ చేశారు. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ తెలుగులో ఒక పెద్ద బ్యానర్ అవుతుంది. నెక్ట్ ఆ సంస్థ నుంచి మంచి మంచి చిత్రాలు రాబోతున్నాయి. మా సినిమాలో పాటలు వింటే సినిమా చూసేందుకు తప్పకుండా థియేటర్ కు వస్తారు. అరుణ్ తో నా ఫ్రెండ్ షిప్ కు గిఫ్ట్ డియర్ మేఘ. మా చిత్రాన్ని సెప్టెంబర్ 3న థియేటర్ లలో చూడండి. అన్నారు.

నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ...మా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి, ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ గారికి థాంక్స్. సాంగ్ రిలీజ్ చేసిన కిరణ్ అబ్బవరంకు థాంక్స్. ప్రతి లవ్ స్టోరి అబ్బాయి కోణంలో ఉంటుంది. కానీ డియర్ మేఘ అమ్మాయి వైపు నుంచి కథను చెబుతుంది. ఈ కథ నచ్చి తెలుగు ప్రేక్షకుల కోసం డెవలప్ చేయించాం. పాటలు వినసొంపుగా, విజువల్స్ గ్రాండ్ గా ఉంటాయి. సెప్టెంబర్ 3న అన్ని జాగ్రత్తలు తీసుకుని డియర్ మేఘ సినిమా చూడండి. అన్నారు.

హీరో ఆదిత్ అరుణ్ మాట్లాడుతూ…మనం థియేటర్ లో ఫ్యామిలీతో కలిసి ఎలాంటి సినిమా చూడాలనుకుంటున్నామో అలాంటి సినిమా డియర్ మేఘ. మా మనసు, మైండ్ అన్నీ పెట్టి చేశాం. ఒక సినిమా విజయం సాధిస్తుందో లేదో ఎవరూ చెప్పలేరు. కానీ మా ప్రయత్నం వందశాతం పెట్టి తెరకెక్కించాం. నా సినిమా థియేటర్ లో రిలీజ్ అయి 28 నెలలు అవుతోంది. మళ్లీ ఈ చిత్రంతోనే మీ ముందుకొస్తున్నా. కాబట్టి ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. నిర్మాత అర్జున్ దాస్యన్ ప్యాషన్ తో డియర్ మేఘ చిత్రాన్ని నిర్మించారు.   ప్రేక్షకుల ఆదరణతోనే ఇంత దూరం వచ్చాము. మీ లవ్ కు థాంక్స్. సెప్టెంబర్ 3న థియేటర్స్ కు రావడం మర్చిపోకండి. అన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు వీఎన్ ఆదిత్య, నిర్మాత ప్రసన్న కుమార్, సంజయ్ రెడ్డి, సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ, సంగీత దర్శకుడు హరి గౌర ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES