HomeTelugu''డియర్ మేఘ'' చిత్రంలోని 'గుండెల్లో కన్నీటి మేఘం' లిరికల్ సాంగ్ రిలీజ్

”డియర్ మేఘ” చిత్రంలోని ‘గుండెల్లో కన్నీటి మేఘం’ లిరికల్ సాంగ్ రిలీజ్

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ”డియర్ మేఘ”. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. సుశాంత్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ”డియర్ మేఘ” చిత్రంలోని ‘గుండెల్లో కన్నీటి మేఘం..’ అనే లిరికల్ సాంగ్ ను హీరోయిన్ హెబా పటేల్ శనివారం విడుదల చేశారు. ఎమోషనల్ గా సాగే ఈ పాట మనసును మెలిపెడుతుంది.

ఈ పాట ఎలా ఉందో చూస్తే….గుండెల్లో కన్నీటి మేఘం..కమ్మిందా తానైతే దూరం…అడిగే లోపే, అతడే లేడే, మాటేమో నలిగింద పెదవుల వెనకే, మౌనం, లోనె…గుండెల్లో కన్నీటి మేఘం..కమ్మిందా తానైతే దూరం…గతమే పోదే, మరుపే రాడే, గుర్తొస్తె తన శ్వాస మనసును కోసే…గాయం, చెసె…గుండెల్లో కన్నీటి
మేఘం..కమ్మిందా తానైతే దూరం…అంటూ హృద్యంగా సాగుతుందీ పాట.

హరి గౌర సంగీతాన్ని అందించగా..హరిణి పాట పాడారు. గీత రచయిత కృష్ణ కాంత్ గుండెను తాకేలా రాశారీ పాట భావోద్వేగ ప్రేమకథగా తెరకెక్కుతున్న ”డియర్ మేఘ” సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర, సినిమాటోగ్రాఫర్ – ఐ ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ – పీఎస్ వర్మ, పీఆర్వో – జి.ఎస్.కె మీడియా, నిర్మాత : అర్జున్ దాస్యన్,

రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES