ఈ నెల 18న గ్రాండ్‌గా విప్రైడ్‌ సౌజన్యంతో ‘ఫేమ్‌ ఓప్స్‌ ఇన్‌ఫ్లూయెన్సర్స్ అవార్డ్స్‌ 2022’

508

సోషల్‌ మీడియా వేదికలో పెద్ద ఎత్తున ప్రజాభిమానం పొందిన వ్యక్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘ఇన్‌ఫ్లూయెన్సర్‌ అవార్డ్స్‌ 2022’ పేరిట అవార్డు ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నారు. ‘విప్రైడ్‌’ సమర్పణలో సందీప్‌ గౌతమ్‌ సారధ్యంలో శ్రీని ఇన్‌ఫ్రా, ‘యు మీడియా’ల సహకారంతో ఈనెల 18న జె.ఆర్‌.సి కన్వెన్షన్‌ సెంటర్‌లో సినీ, రాజకీయ రంగ ప్రముఖులు అతిథులుగా అంగరంగ వైభోగంగా జరగబోయే ఈ అవార్డు ఫంక్షన్‌కు సంబంధించిన కర్టెన్‌రైజర్‌ కార్యక్రమం సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని గ్రీజ్‌ మంకీ పబ్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈ అవార్డు ఫంక్షన్‌కి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న శ్రీని ఇన్‌ఫ్రా సీఈఓ శ్రీను మాట్లాడుతూ
ఎక్కడో విలేజ్‌లో వీడియోలు చేసుకొనే వారికి సైతం తగిన గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం రియల్లీ గుడ్‌. సోషల్‌ మీడియా ప్రజలకు బాగా దగ్గరైంది. దీని ద్వారా ఎందరో సెలబ్రిటీలుగా మారారు. అటువంటి వారికి మరింత గుర్తింపు, ఎకంరేజ్‌మెంట్‌ ఇస్తూ ఇటువంటి అవార్డు ఫంక్షన్‌ చేయడం చాలా గ్రేట్‌. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫంక్షన్‌ చేసుకోవడం మరీ సంతోషంగా ఉంది అన్నారు. సందీప్‌కు ఆల్‌ది బెస్ట్‌. ఫేమ్‌ ఓప్స్‌, విప్రైడ్‌ సంయుక్తంగా ఈ అవార్డు ఫంక్షన్‌ చేయడం హ్యాపీగా ఉంది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని గారు, ఎమ్మెల్సీ రవీందర్‌ గారు, బిగ్‌బాస్‌`5 విన్నర్‌ వి.జె. సన్నీలతో పాటు పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు పాల్గొంటారు అన్నారు.

విప్రైడ్‌ హెడ్ సందీప్‌ గౌతమ్ మాట్లాడుతూ... ఇప్పటి వరకూ మనం సినిమా, టీవీ రంగాల్లోని వారికి మాత్రమే అవార్డులు ఇవ్వడం చూసాం. తొలి సారిగా సోషల్‌ మీడియా ద్వారా ఫేమ్‌ అయి, మరికొందరిని ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసిన వారికి గుర్తింపునిస్తూ అవార్డు ఫంక్షన్‌ చేయడం చాలా గర్వంగా ఫీలవుతున్నాము. ‘ఫేమ్‌ ఓప్స్‌’ గూగుల్‌ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. దీన్ని డౌన్లోడ్‌ చేసుకుని ఎవరైనా వారి ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా వారితో డైరెక్ట్‌ ఇంటరాక్షన్‌ ఏర్పాటు చేస్తున్నాం. అందరి సపోర్ట్‌తో ఇలాంటి ఈవెంట్‌లు భవిష్యత్తులో కూడా చేయాలనేది మా కోరిక. ఇటీవల మేం ఒక మీట్‌ అండ్‌ గ్రీట్‌ అనే ఓ ఈవెంట్‌ చేశాం. ఆ సందర్భంగానే సోషల్‌ మీడియా వేదికల మీద తమ టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుని ఎదుగుతున్న వారికి ఏదైనా ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అందులో భాగంగానే పుట్టిన ఐడియా ఈ అవార్డ్సు ఫంక్షన్‌. మా ఆలోచన నచ్చి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ గారు, ఎమ్మెల్సీ రవీందర్‌ గారు, బిగ్‌బాస్‌ విన్నర్‌ సన్ని గారు మాకు సపోర్ట్‌ చేశారు. ఈనెల 18న సాయంత్రం 5 గంటల నుంచి జె.ఆర్‌.సి కన్వెన్షన్‌ సెంటర్‌లో అవార్డ్సు కార్యక్రమం గ్రాండ్‌గా జరుగుతుంది. మొత్తం 21 కేటగిరీల్లో అవార్డులు ఉంటాయి. ప్రతి కేటగిరీలోకి నలుగురు వస్తారు. మొత్తం 110 మంది పోటీ పడుతున్నారు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఓటింగ్‌ ఈనెల 15తో ముగుస్తుంది. అందులో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికి అవార్డు ప్రదానం జరుగుతుంది అన్నారు.

యు మీడియా కళ్యాణ్‌ మాట్లాడుతూ.. సినిమా, టీవీ అవార్డుల స్థాయిలో ఈ సోషల్‌ మీడియా అప్‌కమింగ్‌ సెలబ్రిటీలను సైతం అవార్డులతో గుర్తించడంలో మేము కూడా భాగస్వాములు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిని నింపుతాయి అన్నారు.

టీం కో`ఆర్డినేటర్స్‌ పృథ్వి, అంజనా, మైథిలీ, కృష్ణ, లక్ష్మణ్‌లు మాట్లాడుతూ.. ఎక్కడో విల్లేజ్‌ లో వీడియోలు చేసుకొనే వారికి సైతం తగిన గుర్తింపు రావాలనేదే మా ఆకాంక్ష. అందుకే ఈ అవార్డ్‌ ఫంక్షన్‌కు మా వంతు సహకారం అందించాము. ఇటువంటి అవార్డు ఫంక్షన్‌లో మేం కూడా భాగస్వాములుగా మారినందుకు సంతోషంగా ఉంది అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ తమ వంటి అప్‌కమింగ్‌ వ్యక్తులను గుర్తిస్తూ.. ఇలా అవార్డులతో సత్కరించడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.