అల్లు అరవింద్ సమర్పణలో బ‌న్నీ వాసు నిర్మాత‌గా జీఏ 2 పిక్చ‌ర్స్, ‘వినరో భాగ్యము విష్ణుకథ’

467

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా యంగ్ హ్యాపెనింగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, యంగ్ హీరోయిన్ క‌శ్మీర ప‌ర్ధేశీ జంట‌గా నటిస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురూ ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కులు ప్ర‌శాంత్ నీల్, కిషోర్ తిరుమ‌ల ద‌గ్గ‌ర మురిళి కిషోర్ గ‌తంలో పనిచేశారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరుపతిలో మొదలైంది 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో 80 శాతం షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఇందులోనే పాటలు, ఫైట్ సీక్వెన్స్ లు కూడా ఉండబోతున్నాయి.
పిల్లా నువ్వు లేని జీవితం,‌ భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, చావు క‌బురు చ‌ల్ల‌గా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి అద్భుతమైన విజయాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఇది. ఓ వినూత్న‌మైన క‌థ‌తో ఈ నూత‌న చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లుగా నిర్మాత బ‌న్నీవాసు తెలిపారు. విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ అనే టైటిల్ కు కూడా అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు చైత‌న్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

హీరో – కిర‌ణ్ అబ్బ‌వ‌రం
హీరోయిన్ – క‌శ్మీర ప‌ర్ధేశీ

స‌మ‌ర్ప‌ణ – అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ – జీఏ2పిక్చ‌ర్స్
నిర్మాత – బ‌న్నీవాసు
స‌హనిర్మాత – బాబు
ద‌ర్శ‌క‌త్వం – ముర‌ళి కిషోర్ అబ్బురూ
ఎడిట‌ర్ – మార్తండా కే వెంక‌టేశ్
మ్యూజిక్ – చైత‌న్ భ‌ర‌ద్వాజ్
‌సినిమాటోగ్ర‌ఫి – విశ్వాస్ డేనియ‌ల్
ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్ – స‌త్య గమిడి, శ‌ర‌త్ చంద్ర నాయుడు
ఆర్ డైరెక్ట‌ర్ – రామ్ కుమార్
ప్రొడక్ష‌న్ రిప్రెజంటేటివ్ – ప్ర‌సాద్ చ‌వ‌న్
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Eluru Sreenu
P.R.O