“చిత్రపురి”పై కొంతమంది పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు-

570

1. తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ యొక్క హిస్టరీ.
డా. యం.ప్రభాకర్ రెడ్డి గారు 1991 డిసెంబర్ లో ఏ.పీ. సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ గా నామకరణం చేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది.
• శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి (మాజీ ముఖ్యమంత్రివర్యులు) గారు 1994 జులై 4 న GOMS No -658 ద్వారా 67 ఎకరాల 16 గుంటల స్థలాన్ని సొసైటీకి, గజము 40/- రూపాయల చొప్పున సర్వే నెంబర్ 246/1, మణికొండ జాగీర్ గ్రామంలో కేటాయించడమైనది .
• 1994 సెప్టెంబర్ లో శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు (Ex CM). డా. దాసరి నారాయణ రావు గారు, MS రెడ్డి గారు, KB తిలక్ గారు , జి. హనుమంత రావు గారు, B. భాస్కర రావు, KJ .సారథి గారు , గిరిబాబు గారు , గుమ్మడి గారు తదితర పెద్దలు చేతుల మీదగా “భూమి పూజ” చేయడం జరిగినది.
• నవంబర్ 1994 నుండి సభ్యత్వాలు ఇస్తూ, వాయిదాలు వసూలు చేయడం జరిగినది. 1996 సంవత్సరం మధ్యలో సభ్యులు దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి మొదటిగా 20ఎకరాలకు , 1997 లో 15 ఎకరాలకు ,1999 లో 10 ఎకరాలకు డబ్బులు కట్టి పంచానామాలు చేపించడం జరిగినది..
• కోర్ట్ తీర్పు తరువాత 2002 లో 32 ఎకరాల 16 గుంటలకు డబ్బులు కట్టి పంచానామాలు చేపించడం జరిగినది.
• ఆ తర్వాత రాక్ సొసైటీ వారు కేసు వేయగా 98వ సంవత్సరం నుండి 2002వ సంవత్సరం వరకు ఈ కేసుపై కొట్లాడుతూ HIGH COURT ద్వారా మరలా భూమిని సొంతం చేసుకోవడం జరిగినది. అప్పుడు ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం మన సొసైటీ 67 ఎకరాల 16 గుంటలు 2005వ సంవత్సరంలో తమ్మారెడ్డి భరద్వాజ గారి ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ చేపించుకోవడం జరిగినది.
• ఆ తరువాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయుటకు టెండర్లు పిలవగా, వచ్చిన మూడు టెండర్లు లో IVRCL సంస్థకు ఇవ్వడమైనది.
• HMDA ఫీజు అధిక మొత్తంలో ఉండుటవలన దాసరి నారాయణరావు గారి ఆధ్వర్యంలో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు YS రాజశేఖర్ రెడ్డి గారిని తగ్గించమని కోరగా… మన చిత్రపురికి HMDA ఫీజు లో 25% రాయితీ కల్పించడం జరిగినది.
• 2009 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి రోశయ్య గారి ఆధ్వర్యంలో చిత్రపురి “శంకుస్థాపన ” చేయడం జరిగినది .
• అప్పుడు ముందుగా EWS-224, LIG-1688, HIG-720 పనులు మొదలు పెట్టడం జరిగినది.
• 2014 వ సంవత్సరంలో 1912 ఫ్లాట్స్ హ్యాండోవర్ చేయడం జరిగినది.
• 2015 వ సంవత్సరంలో 720 ఫ్లాట్స్ హ్యాండోవర్ చేయడం జరిగినది.

2. సొసైటీలో సభ్యత్వాల గురించి? Allotment ఫ్లాట్స్ ప్రక్రియ ఎలా? అసలు ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి?

S.NO, FLAT TYPE, No Of UNITS, Flat size,
Sft, No of Blocks, Unit Cost, TOTAL STATUS
1 EWS 224 270 7 225000 5,04,00,000 HANDOVER
2 LIG 1688 465 26 500000 84,40,00,000 HANDOVER
3 MIG- 1176 996 10 1925000 226,38,00,000 80% Work Completed
4 HIG 720 1670 12 3050000 219,60,00,000 HANDOVER
5 HIG Duplex 180 2509 5 4966200 89,39,16,000 90% Work Completed
6 ROW House 225 2250 4400000 99,00,00,000 65% Work Completed

Total
4213
723,81,16,000

• సొసైటీ సభ్యత్వాలు సొసైటీ బైలా ప్రకారం తీసుకొనబడినవి.
తెలుగు సినీ రంగానికి సంబంధించిన యూనియన్ /అసోసియేషన్ నుండి, స్టూడియోలు, ల్యాబులలో, థియేటర్లలో, సినిమా రంగానికి సంబంధించిన ఆఫీసుల్లో పనిచేసిన వారి గుర్తింపు కార్డు లేదా యూనియన్ లెటర్ తీసుకొచ్చిన వారికి మాత్రమే సభ్యత్వాలు ఇవ్వబడినవి. అలాగే సర్వసభ్య సమావేశంలో తీసుకొన్న నిర్ణయం ప్రకారం టీవీ రంగం సంబంధించిన వారికి కూడా ఇవ్వడం జరిగినది.

సొసైటీలో సభ్యత్వం తీసుకున్న తరువాత ఫ్లాట్ ఖరీదులో 25% కట్టిన వారికి Allottment కమిటీ వారిచే, ఫ్లాట్ ఎలాట్ చేయడం జరుగుతుంది. అట్టి అలాట్మెంట్ చేయుటకు ప్రభుత్వం 5 మంది కమిటీ మెంబర్స్ ను నియమించడం జరిగినది. వీరి సమక్షంలో Flat Allottments జరిగినాయి.
ఫ్లాట్స్ అలాట్మెంట్ అయిన తరువాత, వారికి ఇచ్చిన అలాట్మెంట్ లెటర్ లో పేమెంట్ షెడ్యూల్ ఇవ్వడం జరిగినది.
షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న పనిని బట్టి బకాయిలు పే చేయమని వారికి నోటీసులు ద్వారా తెలియజేయడం జరిగినది. అట్టి నోటీసులకు స్పందించకుండా ఉన్న సభ్యులను తొలగించి వారి స్థానంలో వెయిటింగ్లో ఉన్న సభ్యులకు ఇవ్వడం జరిగినది.
సొసైటీ లో మొత్తం సభ్యత్వాలు – 9153
సభ్యత్వ రుసుము మాత్రమే కట్టిన వారు -1617
ఫ్లాట్ ఖరీదు లో 25% కంటే తక్కువ కట్టిన వారు -2733
పై వారి అందరికి చెక్కులు పంపడం జరిగినది.

ఇప్పుడు ఉన్న సభ్యులు – 4803.

2016 సంవత్సరం నుండి సొసైటీలో కొత్త సభ్యత్వాలు ఇవ్వడం జరగలేదు.

3. సొసైటీలో ఇప్పటి వరకూ వర్కు చేసిన, చేస్తున్న కాంట్రాక్టుల గురించి. వారి వివరాలు!
సొసైటీ లో 2004 వ సంవత్సరం లో IVRCL వారికి మొదటిగా మొత్తం టర్న్ కీ కాంట్రాక్టు ఇవ్వడం జరిగినది. ఆ తరువాత IVRCL వారు పలువురికి సబ్ కాంట్రాక్టు ఇవ్వడం జరిగినది.
IVRCL వారు సుమారు 46 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో తీసుకోవడం జరిగినది.
ఆ డబ్బులు రికవరీ కొరకు ప్రయత్నం చేస్తున్నాము.

ఆ తరువాత సొసైటీ నుండి SVRM వారికి ROW House కాంట్రాక్టు , Yours Construction వారికి MIG, HD కాంట్రాక్టు ఇవ్వడం జరిగినది.

Yours Construction వారు కూడా అగ్రిమెంట్ ప్రకారం పని చేయకుండా అడ్వాన్స్ తీసుకోవడం జరిగినది. ఆ డబ్బులు రికవరీ కొరకు కోర్ట్ పరిధిలో ప్రయత్నం చేస్తున్నాము.

ఇప్పుడు Row House, MIG, HD వర్క్ SVRM కాంట్రాక్టర్ ద్వారా జరుగుచున్నది.

4. సొసైటీ ఇప్పటి వరకు తీసుకున్న లోన్లు, వాటి వివరాలు!
2005 వ సంవత్సరములో మొదటిగా DHFL ఫైనాన్స్ ద్వారా 20 కోట్లు లోన్ తీసుకోవడం జరిగినది.
ఆ తరువాత ఆ లోన్ చెల్లించి, SBI బ్యాంకు ద్వారా విడతల వారీగా సుమారు 180 కోట్లు తీసుకోవడం జరిగినది. దీని నిమిత్తం సుమారు 52 కోట్లు ఇంటరెస్ట్ కట్టడం జరిగినది.
వారి దగ్గర తీసుకొన్న 180 కోట్లు గాను 167 కోట్లు తిరిగి చెల్లించడం జరిగినది.
మిగిలిన 13 కోట్లకు Balance వుంది. ఈ Balance కు OTS అవకాశం కల్పించారు.
ఇప్పుడు OTS స్కీం ద్వారా 8 కోట్లు రూపాయలు జులై 20 వ తేది లోపు కట్టవలయును, లేనిచో మన ల్యాండ్ వేలం వేయబడును అని తెలపడం జరిగినది.
ఆ SBI లోన్ కట్టుటకు ఈ కమిటీ ప్రయత్నం చేయుచున్నది.

5. సొసైటీ మీద కొంత మంది సభ్యులు చేస్తున్న ఆరోపణలు గురించి!
కొంత మంది సభ్యులు సొసైటీ మీద మరియు వ్యక్తిగతంగా పనికట్టుకొని విషప్రచారం చేయుచున్నారు.
కొందరు సభ్యులు సొసైటీ నుండి నోటీస్లు వచ్చినప్పుడు స్పందించకుండా, సరియైన సమయంలో డబ్బులు చెల్లించకుండా ఉండడం వలన Byelaw No.43(B) ప్రకారం వారి ఫ్లాట్ తొలగించినాము. అట్టి వారు ఇప్పుడు మాకు ఫ్లాట్ తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు.
మరికొందరు సొసైటీని ఇలా ఇబ్బందులు పాలు చేసి, బ్లాక్ మెయిల్ చేసి ఫ్లాట్స్ లబ్ది పొందాలని కొందరు ఒత్తిడి చేస్తున్నారు.
సొసైటీ కి సంబంధం లేని వ్యక్తులను సోషల్ మీడియాలో సొసైటీని మరియు కమిటీ సభ్యులను అసభ్య పదజాలంతో మాట్లాడించడం జరుగుచున్నది.
వారు చేసే ఆరోపణలు అన్నియూ పచ్చి అబద్దాలు.

6. సొసైటీకి ఇప్పుడు రావలసిన పర్మిషన్లు గురించి!

సొసైటీకి ఇప్పుడు ఎన్విరాల్మెంటల్ పర్మిషన్ నిమిత్తం రూపాయలు 4.12కోట్లు చెల్లించవలసి ఉన్నది .మరియు Row House, HD లకు చేసిన మార్పుల విషయంగా HMDA పర్మిషన్ రావలయును. అతి త్వరలో ఎన్విరాల్మెంటల్ పర్మిషన్ కు డబ్బులు కట్టి అన్ని పర్మిషన్ లు తీసుకువస్తామని తెలియజేయుచున్నాము .

7. సొసైటీ లో నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ ముందున్న ప్రణాళిక ఏమిటి? సొసైటీ ఆర్ధిక పరిస్థితి వివరాలు?
10-12-2020 వ తేదీన కోఆపరేటివ్ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా కట్టుదిట్టమైన భద్రత వలయంలో చిత్రపురి ఎలక్షన్స్ జరిగినవి. ఆ ఎలక్షన్స్ లో 4 ప్యానెల్ లు పోటీ చేయగా Dr. M. వినోద్ బాల గారి బలపరిచిన అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ సభ్యులు(10 మంది ) గెలుపొందడం జరిగినది.

గెలిచిన నాటికీ ఈ కమిటీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి.
ఆ సవాళ్ళను ఆదిగమించి ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్ళడానికి విశేష కృషి చేస్తున్నాము.

IVRCL నుండి రావలసిన 46 కోట్లు విషయంగా పలువిధాల ప్రయాస పడి ,ఇప్పుడు ఉన్న కమిటీ NCLT కి ఫైల్ చేసి లిక్విడేటర్ దగ్గర 46 కోట్లు అడ్మిట్ చేయించడం జరిగినది.

ఇప్పుడు మా ముందు ఉన్న తక్షణ కర్తవ్యం….

SBI బ్యాంకు లోన్ తీర్చుట.
Row House, HD లకు పర్మిషన్ తీసుకురావడo.
మన MIG, ROW House, HIG Duplex ఫ్లాట్స్ డిసెంబర్ 2021 లోపు పూర్తి చేయుటకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లి కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తున్నాము .

ఈ మధ్యకాలంలో MIG లో ఉన్న మధ్య తరగతి కార్మికుల ఆవేదన అర్ధం చేసుకోకుండా, స్పీడ్ గా జరుగుతున్న నిర్మాణాలకు వివిధ రకాలుగా అడ్డుపడుతున్న కొంతమంది వ్యక్తులు, ఈ నిర్మాణాలకు ఆణువణువూ అడ్డుపడుతూ, సొసైటీ కమిటీ లో కొందరిని వ్యక్తి గతంగా దూషిస్తూ రకరకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారు. అయినప్పటికీ ఈ కమిటీ సహనం కోల్పోకుండా ముందుకు వెళ్లుతున్నాము.

ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన మా యొక్క అంతిమ లక్ష్యం ప్రాజెక్టు పూర్తి చేయడం. అందరి కళ్ళలో ఆనందం చూడడం .
చిత్రపురి సభ్యుల గృహాప్రేవేశాలే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ……….

ధన్యవాదములుతో….

(అనిల్ కుమార్ వల్లభనేని ) (కాదంబరి కిరణ్)
అధ్యక్షులు , కార్యదర్శి ,
తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ .