ఆరేళ్ళ అద్భుత ప్రస్థానం”సుమన్ టీవీ”

895

నిజాయతీ, నిబద్దత, సంకల్పం పునాదులుగా ప్రారంభమైన “సుమన్ టీవీ” నేటితో 6 వసంతాలు పూర్తి చేసుకుని, దిగ్విజయంగా 7వ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టింది. మొదటి నుండి శ్రమనే పెట్టుబడిగా భావించే స్వయం కృషీవలుడు సుమన్.. 2015 జులై 2న “PlayEven Info Pvt Ltd” పై “సుమన్ టీవీ” ని స్థాపించారు. ఈ ప్రయాణంలో ఎదురైన ప్రతి సవాలుని, ప్రతికూలతని, కష్టాన్ని ఆయన ఇష్టంగానే అధిగమించారు.ఈ కారణంగానే ఆనాడు ఒక్క ఉద్యోగితో, ఒక్క ఛానెల్ గా మొదలైన “సుమన్ టీవీ”.. 100 ఛానెల్స్ గా విస్తరించి, 200 మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ.., సౌత్ ఇండియన్ అగ్రగామి వెబ్ ఛానెల్ గా అవతరించింది.

ఈ 6 ఏళ్ళ స్వల్ప ప్రయాణంలోనే యూట్యూబ్ నుండి 50 కి పైగా అఫీషియల్ రివార్డ్స్,
రోజుకి 2 కోట్ల వ్యూయర్ షిప్, మొత్తంగా 3.5 కోట్ల సబ్ స్క్రైబర్స్, ఇవన్నీ..
“సుమన్ టీవీ నెట్వర్క్” సాధించిన అద్వితీయ విజయాలు.

* ప్రేక్షకులను సరికొత్త ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లే.. సుమనోహరమైన “సుమన్ టీవీ భక్తి” గీతాలు

* ఆరోగ్యవంతమైన జీవన విధానం కోసం .. అనుభవజ్ఞలైన డాక్టర్స్ ఇచ్చే ఆరోగ్య సలహాల సమాహారంతో వీడియోలు

* “షీ ఫ్యాషన్స్” ట్రెండ్ లో మహిళలను మహారాణులుగా నిలిపే ఎన్నో అలంకారాలు

* అమ్మతనానికి నిండుతనం తెచ్చే సలహాలతో “సుమన్ టీవీ మామ్” వీడియోలు

* యువత లక్ష్య సాధనలో వారికి చేయూతగా నిలిచే.. “సుమన్ టీవీ జాబ్స్” సూచనలు

* విజేతల అనుభవాలను వీడియోలుగా మదించి.. ప్రజల్లో స్ఫూర్తిని నింపే “సుమన్ టీవీ సక్సెస్” స్టోరీలు

* అన్నం పెట్టే రైతన్నకు దన్నుగా.. నూతన రీతుల వ్యవసాయ సాగుబడికి సలహాలు

* మీ పెట్టుబడులను పదింతలు పదిలంగా పెంచే ఆర్ధిక నిపుణుల సూచనలతో.. “సుమన్ టీవీ మని” వీడియోలు

* వార్త ఏదైనా, పరిస్థితులు ఏవైనా సమాచార సామ్రాజ్యంలో వెనకడుగు ఎరుగని “సుమన్ టీవీ న్యూస్” ప్రసారాలు

* వినోద రంగంలో అతిరధమహారథుల అంతరంగాన్ని ఆవిష్కరించే.., “సుమన్ టీవీ ఎంటర్టైన్మెంట్” ఇంటర్వ్యూలు

ఇలా ఒకటా, రెండా.. సమాజంలోని అన్ని అంశాలను స్పృశిస్తూ, “సుమన్ టీవీ నెట్వర్క్” ప్రయాణం.. ఓ మహా ప్రస్థానంగా సాగుతుంది.

ఎంతటి విజయమైనా.. మరో ముందడుగుకి పునాది మాత్రమేనని “సుమన్ టీవీ” వ్యవస్థాపకులు సుమన్ నమ్మకం. ఇందుకే ఆయన ఇప్పుడు “సుమన్ టీవీ”ని డిజిటిల్ లోకలైజ్డ్ చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే వైజాక్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి నగరాల్లో “సుమన్ టీవీ నెట్వర్క్” మల్టిపుల్ బ్రాంచెస్ ప్రారంభమయ్యాయి. రానున్న కాలంలో అన్ని జిల్లాలలోను “సుమన్ టీవీ” డిస్ట్రిక్ బ్రాంచెస్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమవుతోంది.

సుమన్ టీవీ” అంటే కేవలం ఓ వ్యాపార శక్తి మాత్రమే కాదు. దాతృత్వాన్ని చాటుకోవడంలో కూడా “సుమన్ టీవీ” నేను సైతం అంటూ ఎప్పుడూ ముందడుగు వేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతిసారి “సుమన్ టీవీ” ప్రజా సేవలో భాగం అవుతూ వస్తోంది. లాక్ డౌన్ వేళ.. ఎందరో అభాగ్యులకు నిత్యావసరాలు అందించి అండగా నిలిచిన ఘనత “సుమన్ టీవీ” కే దక్కుతోంది. ఇవన్నీ కాక.., ప్రతిరోజు 100 మందికి పైగా పేదవారి ఆకలి తీర్చే అద్భుతమైన అన్నదాన కార్యక్రమాన్ని “సుమన్ టీవీ” నిర్విఘ్నంగా నిర్వర్తిస్తూ వస్తోంది.

ఇలా 6 ఏళ్ళ ప్రస్థానంలో “సుమన్ టీవీ నెట్వర్క్” అందుకున్న విజయాలు, గమ్యాలు, ప్రశంసలు, ఎన్నో.. ఎన్నెన్నో. ఈ మొత్తం ప్రయాణంలో సుమన్ టీవీ సీఈఓ పద్మజ గారి కృషి వెలకట్టలేనిది. ఇక సుమన్ టీవీ సాగిస్తున్న ఈ జైత్రయాత్రలో ఉద్యోగుల సమిష్టి కృషి కూడా మరువలేనిది. భవిష్యత్ లో కూడా ఇలాగే మరెన్నో నూతన కార్యక్రమాలతో.. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి లీడింగ్ వెబ్ ఛానెల్ “సుమన్ టీవీ” సంసిద్ధంగా ఉందని సగర్వంగా తెలియచేస్తున్నాము.

6 Years Of SumanTV Incredible Journey