*హీరో శ్రీకాంత్ విడుదల చేసిన ‘చిత్రం ఎక్స్’ ట్రైలర్*

762


శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవీ మూవీ క్రియేషన్స్ పతాకంపై రాజ్‌బాల, మానస హీరోహీరోయిన్లుగా రమేష్ వీభూది దర్శకత్వంలో పొలం గోవిందయ్య నిర్మించిన చిత్రం ‘చిత్రం ఎక్స్’. ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ హీరో శ్రీకాంత్ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ చిత్రం ఎక్స్ ట్రైలర్ అద్భుతంగా ఉంది. హీరో రాజ్‌బాలకి ఈ సందర్భంగా ‘ఆల్ ద బెస్ట్’ చెబుతున్నాను. ప్రేక్షకులందరూ ఇటువంటి మంచి చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.

హీరో రాజ్‌బాల మాట్లాడుతూ.. ‘‘హీరో శ్రీకాంత్‌గారు మా చిత్ర ట్రైలర్‌ని చూసి అభినందించడం ఆనందంగా ఉంది. మేము 40 రోజులు భయంకరమైన ఫారెస్ట్‌లో పడ్డ కష్టాన్ని, శ్రీకాంత్‌గారి అభినందనలతో మరిచిపోయాము. ఈ సందర్భంగా ఆయనకి మా యూనిట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కరోనా సమయంలో శ్రీకాంత్‌గారు ట్రైలర్ విడుదల చేసి మమ్మల్ని ప్రోత్సహించడం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన కెమెరామెన్ ప్రవీణ్‌గారికి, దర్శకనిర్మాతలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..’’ అన్నారు.

నిర్మాత పొలం గోవిందయ్య మాట్లాడుతూ.. ‘‘కరోనా కష్టకాలంలో పెద్ద మనసుతో శ్రీకాంత్‌గారు మా ట్రైలర్‌ని విడుదల చేసి, మమ్మల్ని ఆశీర్వదించడం ఆనందంగా ఉంది. మా దర్శకుడు మంచి కథ చెప్పాడు. దానికి తగ్గ హీరో మా రాజ్‌బాల మాకు దొరికాడు. మూవీ అవుట్‌పుట్ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను..’’ అన్నారు.

దర్శకుడు రమేష్ వీభూది మాట్లాడుతూ.. ‘‘14 సంవత్సరాలు దర్శకత్వశాఖలో పనిచేశాను. గర్వించదగ్గ డైరెక్టర్ తేజగారి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాను. నా కథకు మంచి నిర్మాత, మంచి హీరోహీరోయిన్లు దొరికారు. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. దీనికి మా కెమెరామెన్ ప్రవీణ్. కె. కావలి, సంగీత దర్శకులు శివప్రణయ్‌ల పనితనం ఎంతో ఉపకరించింది. వీరికి తోడు ఫైట్ మాస్టర్ అంజి, ఎఫెక్ట్స్ రాజు‌గారు తోడవడంతో విజువల్‌గా సూపర్‌గా అనిపించుకుంది. డెఫినెట్‌గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను..’’ అని అన్నారు.

రాజ్‌బాల, మానస హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: శివప్రణయ్, కెమెరామెన్: ప్రవీణ్. కె. కావలి, ఫైట్స్: అంజి మాస్టర్, డ్యాన్స్: కపిల్ ఆకుల, ఎడిటింగ్: సాయికుమార్ ఆకుల, ఎస్ఎఫ్ఎక్స్: రాజు, నిర్మాత: పొలం గోవిందయ్య, దర్శకత్వం: రమేష్ వీభూది.