కేథరిన్ థెరిసా – సందీప్ మాధవ్ జంటగా నటిస్తున్న ‘ప్రొడక్షన్ నంబర్ వన్’ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!!

117

“జార్జిరెడ్డి, వంగవీటి’ వంటి వరుస విజయాలతో దూసుకెళ్తున్న వెర్సటైల్ యాక్టర్ సందీప్ మాధవ్ మరొక డిఫెరెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, రీసెంట్ గా వాల్తేరు వీరయ్య, వంటి సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించిన గ్లామరస్ బ్యూటీ కేథరిన్ థెరిసా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ మహా విష్ణువు మూవీస్, పల్లి పైడయ్య ఫిలిమ్స్ పతాకాలపై సోమ విజయ్ ప్రకాష్ నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ అశోక్ తేజ (ఓదెల రైల్వే స్టేషన్) ఫేమ్ దర్శకత్వంలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్ నంబర్ వన్’ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ దిగ్విజయంగా పూర్తిచేసుకుంది..

ఈ చిత్ర విశేషాలను నిర్మాతల్లో ఒకరైన దావులూరి జగదీశ్ తెలుపుతూ “కేథరిన్, సందీప్ మాధవ్, కాంబినేషన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఒక పవర్ ఫుల్ పోలీస్ క్యారక్టర్ లో సందీప్ మాధవ్ నటిస్తున్నాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాజీవ్ నాయర్ నేతృత్వంలో వేసిన అద్భుతమైన పోలీస్ స్టేషన్, హీరో హౌస్, హీరోయిన్ హౌస్ సెట్స్ లలో భారీ తారాగణంతో సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకరించామ్.. మలి షెడ్యుల్ సెప్టెంబర్ నాలుగు నుండి ప్రారంభించి కంటిన్యుస్ గా జరపాలని ప్లాన్ చేశాం. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది గారు మా కథ విని ఇంప్రెస్ అయి దానికి తగ్గట్లుగా ఓ క్రేజీ టైటిల్ ని సూచించారు. ఆ టైటిల్ ని సెప్టెంబర్ 6న ప్రకటించనున్నాం.. మా దర్శకుడు అశోక్ తేజ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేము అనుకున్న దానికన్నా సినిమా ఎక్స్ టార్డినరిగా వస్తుంది. అనూప్ రూబెన్స్ సూపర్బ్ మెలోడియస్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నారు. అలాగే కెమెరామెన్ ముత్యాల సతీశ్ ఈచ్ అండ్ ఎవ్విరి ఫ్రేమ్ ని బ్యూటిఫుల్ గా చిత్రీకరిస్తున్నారు. ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ అర్టిస్తులందరూ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని అద్భుతమైన క్వాలిటీతో ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా రూపొందిస్తున్నాం. చాలా కాలం తర్వాత ముఖ్యమైన పాత్రలో “ఆది” ఫేం కీర్తిచావ్లా నటిస్తోంది. అలాగే సినిమాలో ఒక కీలక పాత్రలో రాజ చెంబోలు నటిస్తున్నారు.

*కేథరిన్ థెరిసా-సందీప్ మాధవ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజ చెంబోలు, రవి కాలే, శ్రీనివాసరెడ్డి, మధునందన్, దొరబాబు, ఆనంద్ చక్రపాణి, మహేష్ విట్టా, నాగ మహేష్, కోటేశ్వరరావు, జగదీశ్, అధ్విక్ మహారాజ్, కీర్తి చావ్లా, బేబీ కృతి, ఘట్టమనేని సాయి రేవతి, నిష్మా, దీక్ష పంత్, పూజరెడ్డి, భానుశ్రీ, తదితరులు నటిస్తున్నారు .

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: సతీష్ ముత్యాల, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్, ఎడిటర్: జునైద్ సిద్ధిక్, పి.ఆర్.ఓ: జిల్లా సురేష్, సహానిర్మాతలు: గౌటి హరినాథ్, రొంగుల శివకుమార్, నిర్మాతలు: దావులూరి జగదీశ్, పల్లి కేశవరావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అశోక్ తేజ.*