తంతిరం టీజర్ కి అనూహ్య స్పందన ఈ నెల 22న విడుదల ..

164


ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా చూసేసి బ్రహ్మరథం పట్టేస్తున్నారు మన ప్రేక్షకులు. ఈ క్రమంలోనే రూపొందించిన సినిమానే తంతిరం. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది.ఈ తంతిరం హర్రర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రంగా, భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా అనేది ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో న‌వ‌త‌రం నటీన‌టుల‌తో తీసిన సినిమా కంటెంట్ మాత్రమే నమ్మిన ప్రొడ్యూసర్ సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా బండి బ్యానర్ పైన ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా నిర్మాత తెరకెక్కించారు

నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ ,అవినాష్ వెలందరు, శ్రీనివాసమూర్తి

దర్శకులు : ముత్యాల మెహర్ దీపక్

నిర్మాతలు: శ్రీకాంత్ కంద్రగుల (SK )

సంగీత దర్శకులు: అజయ్ అరసడ

సినిమాటోగ్రఫీ: సిరుగుడి వంశీ శ్రీనివాస్

ఎడిటర్ : సిరుగుడి వంశీ శ్రీనివాస్