బొమ్మ దేవర రామచంద్ర రావు రూపొందుతోన్న ‘మాధవే మధుసూదనా’ పెద్ద స‌క్సెస్ కావాలి : టీజ‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో విష్ణు మంచు

193

ఓ అమ్మాయి అబ్బాయి మ‌న‌స్పూర్తిగా ప్రేమించుకుంటారు. వారి మ‌ధ్య అంత‌రాలు వారి ప్రేమ‌కు అడ్డంకిగా ఎలా మారింది? దాన్ని వారెలా దాటి ముందుకెళ్లారు.. వారి ప్రేమ స‌క్సెస్ అయ్యిందా? అనే విష‌యం తెలుసుకోవాలంటే ‘మాధవే మధుసూదనా’ సినిమా చూడాలంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత బొమ్మ దేవర రామచంద్ర రావు.

బొమ్మ దేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ్ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మ దేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మాధవే మధుసూదనా’ సినిమా టీజ‌ర్‌ను గుర‌వారం విష్ణు మంచు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా జరిగిన కార్య‌క్ర‌మంలో…

విష్ణు మంచు మాట్లాడుతూ ‘‘మాధవే మధుసూదనా’ టీమ్‌కి ఆల్ ది బెస్ట్. సినీ ఇండ‌స్ట్రీలో ఓ యాక్ట‌ర్‌కి, మేక‌ప్ మేన్‌కి ఉన్న బంధం భార్యాభ‌ర్త‌ల్లాంటిది. నేను చిన్నప్పటి నుంచి చంద్రగారిని చూస్తున్నాను. ఓ రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా, నిర్మాత‌గా సినిమా చేయ‌టం అంత సామాన్య‌మైన విష‌యం కాదు. ఆయ‌న మంచి మ‌న‌సుకి అంతా మంచే జ‌రుగుతుంది. హీరో తేజకి అభినంద‌న‌లు. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ద‌ర్శ‌క నిర్మాత బొమ్మ దేవర రామచంద్ర రావు మాట్లాడుతూ ‘‘నన్ను ఈ స్థాయిలో నిల‌బెట్టిన మా అన్నపూర్ణ స్టూడియో సంస్థ‌కు, నాగార్జ‌న‌గారికి రుణ‌ప‌డి ఉంటాను. అలాగే మోహ‌న్‌బాబుగారికి ఫోన్ చేయ‌గానే నాకు అండ‌గా ఉంటాన‌ని చెబుతూనే ఆయ‌న సింగ‌పూర్‌లో ఉండ‌టం వ‌ల్ల రాలేన‌ని అన్నారు. ఆయ‌న స్థానంలో విష్ణుని పంపుతాన‌ని అన్నారు. అందుకు ఆయ‌న‌కు థాంక్స్‌.

కె.దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘క్రమశిక్షణ, నిబద్దత కారణంగానే ఈరోజు చంద్ర ద‌ర్శ‌కుడి, నిర్మాత‌గా, రైట‌ర్‌గా సినిమాను చేస్తున్నారు. ఆయ‌న త‌న కొడుకు తేజను ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు.

హీరోయిన్ రిషిక లోక్రే మాట్లాడుతూ ‘‘సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్ప‌టికే వ‌చ్చిన రెండు పాట‌లకు మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. అవ‌కాశం ఇచ్చిన చంద్ర‌గారికి, స‌పోర్ట్‌గా నిలిచిన తేజ‌గారికి థాంక్స్‌’’ అన్నారు.

హీరో తేజ్ బొమ్మ‌దేవ‌ర మాట్లాడుతూ ‘‘నాకు సపోర్ట్ చేసి వారి బ్లెస్సింగ్స్ అందించిన నాగార్జున‌ గారికి, చైతన్య గారికి, విష్ణు గారికి, బ్ర‌హ్మానందం గారికి థాంక్స్‌. మా నాన్న‌గారి సంక‌ల్ప‌మే ఆయ‌న్ని గొప్ప మేకప్ మేన్‌గా చేసింది. అదే ఈరోజు న‌న్నిక్క‌డ నిల‌బెట్టింది. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాన‌నే న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ వికాస్ బాడిస మాట్లాడుతూ ‘‘నాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అవ‌కాశం ఇచ్చిన చంద్ర‌గారికి థాంక్స్ చెబుతున్నాను. సినిమా లో నాలుగు పాటలున్నాయి. అన్నీ పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తున్నాయి. రెండు పాట‌లు ఇప్ప‌టికే రిలీజ్ అయ్యాయి. హీరో తేజ్ మంచి అనుభ‌వ‌మున్న యాక్ట‌ర్‌గా న‌టించారు. మా మూవీకి అంద‌రూ స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

డైరెక్ట‌ర్ స‌ముద్ర‌, ఆదిత్య నిరంజ‌న్‌, సురేష్ కొండేటి, ప్ర‌సన్న‌కుమార్, వై.వి.ఎస్‌.చౌద‌రి త‌దిత‌రులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

నటీ నటులు: తేజ్ బొమ్మ దేవర, రిషిక లోక్రే, జయ ప్రకాష్, శైలజా ప్రియ, బి. రామచంద్ర రావు, నవీన్ నేని, రవి శివ తేజ, మాస్టర్ అజయ్, అంజలి, శ్రీ లత తదితరులు.

సాంకేతిక వ‌ర్గం: సమర్పణ : బొమ్మ దేవర శ్రీదేవి, బ్యానర్ : సాయి రత్న క్రియేషన్స్, రచన దర్శకత్వం : చంద్ర, నిర్మాత : బొమ్మ దేవర రామచంద్ర రావు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : వాసు, సంగీతం : వికాస్ బాడిస, ఎడిటింగ్ : ఉద్దవ్ ఎస్ బి, మాటలు : బి సుదర్శన్, కొరియోగ్రఫీ : రాజు సుందరం – బృంద, డాన్స్: రఘు & యశ్, పాటలు : శ్రీమణి, అనంత శ్రీరామ్, శ్రీ సిరాగ్, కో డైరెక్టర్ : వాయుపుత్ర, పి.ఆర్.ఓ : పర్వతనేని రాంబాబు, సాయి సతీష్, పబ్లిసిటీ డిజైనర్ : డ్రీమ్ లైన్, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మానుకొండ మురళీకృష్ణ.