బాలీవుడ్ తెరపై కొత్త విలనిజం ప్రజ్ఞన్

239


ప్రస్తుతం తెలుగు సినిమా బాలీవుడ్ లో బావుటా ఎగుర వేస్తున్న తరుణంలో కరీంనగర్ కుర్రాడు బాలీవుడ్ చిత్రంలో విలన్ గా నటించాడు. వివరాల్లోకెళితే పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందిన కొంతమంది విద్యార్థులు కలిసి ఫ్రెండ్స్ అండ్ ఫిలిమ్స్ పతాకం పై హిందీ, తెలుగులో ‘కాలా బార్ బేరియన్ చాప్టర్ 1’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో మంచి ఫర్ ఫార్మెన్స్ వున్న పాత్రలో కరీంనగర్ కు చెందిన ప్రజ్ఞన్ నటించారు. చిన్నప్పటి నుంచి సినిమాల మీదున్న మక్కువతో ప్రజ్ఞన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నాలుగైదు చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత పూణేలో మల్టీ మీడియాలో నైపుణ్యం సాధిస్తూ, మరో వైపు పూణే ఫిల్మ్ ఇన్టిస్టిట్యూట్ లో ప్రత్యేక శిక్షణ పొంది, ప్రస్తుతం ‘ కాలా బార్ బేరియన్ చాప్టర్ 1’ అనే చిత్రంలో విలన్ గా నటించాడు.

కాలా బార్ బేరియన్ చాప్టర్ 1’ చిత్రం పోస్టర్, ట్రైలర్ లాంచింగ్ సోమవారం సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు ఎన్ . శంకర్ ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ , తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ సినిమా పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ప్రజ్ఞన్ క్యారెక్టర్ చాలా బాగా నటించాడు అని అన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులో సక్సెస్ అవ్వాలని.. మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.ప్రజ్ఞన్ కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ సినిమా అనేది మనిషిని నిద్రలేపేదిగా ఉండాలేకాని నిద్రపుచ్చేదిగా ఉండొద్దని అన్నారు. కమర్షియల్ అంశాలతో పాటు మంచి సందేశం కూడా ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతోందని పేర్కొన్నారు. కరీం నగర్ నుంచి సినిమా రంగంలోకి వచ్చిన ప్రజ్ఞ్యన్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు. తామందరం జై బోలో తెలంగాణ సినిమాలో తెరపైకి కనిపించమని , ఈ ఘనత శంకర్ కు దక్కుతుందని చెప్పారు.

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కరీం నగర్ నుంచి జయరాజ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారని, ఆయన హిందీ సినిమాతోనే ఈ అవార్డును అందుకోవడం మనందరికీ గర్వకారణమని అన్నారు. ప్రజ్ఞ్యన్ కూడా జయరాజ్ నట వారసుడిగా అంతటి స్థాయిని అందుకోవాలని ఆకాంక్షించారు. దర్శకుడు ఎన్ . శంకర్ చెయ్యి చాలా మంచిదని, ఆయన తో సినిమా చేసిన వాళ్ళు చాలా మంది రాజకీయాల్లో ఉన్నతపదవులను అధిరోహించారని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఎన్ కౌంటర్ సినిమా చేసిన తరువాతే ఎంపీ అయ్యారని, అలాగే అదే సినిమాలో నటించిన రోజా మంత్రి అయ్యారని, స్మృతి ఇరానీ కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారని ప్రసన్న పేర్కొన్నారు.

విలన్ గా చక్కటి నటనను కనబరిచిన ప్రజ్ఞన్ మాట్లాడుతూ ‘ కరీంనగర్ జిల్లాలో పుట్టిన నేను ఫూణేలో వర్క్ చేసుకుంటూ నటనలో శిక్షణ పొందాను. నా తొలి చిత్రం ‘కాలా బార్ బేరియన్ చాప్టర్ 1’లో విలన్ గా నటించాను. అన్ని విభాగాలలో శిక్షణ పొందినందున ఈ చిత్రంలో నటించడం నాకు పెద్ద కష్టం అనిపించలేదు. చక్కటి ఫర్ ఫార్మెన్స్ వున్న ఈ పాత్రలో ఇష్టపడి నటించినందున దర్శకుడి నుంచి, నిర్మాత, సహ నటుల నుంచి నాకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాలో నేను ఒక సైకో, మల్టీ పర్సనాలిటీ, నెక్రోఫిలియక్, ఇలా చాలా వేరియషన్స్ వున్న పాత్రల్లో నటించి చిత్ర యూనిట్ ను మెప్పించాను. దర్శకుడు జింటో చాకో శామ్యూల్ సినిమాను చక్కగా తీర్చి దిద్దారు. పూణేలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమును సినిమాటో గ్రాఫర్ ఆరీఫ్ అందంగా మలిచారు. సినిమాకు గౌరవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది. మంచి కథా బలం వున్న ఈ చిత్రంలో నటీ నటులందరూ పూణే ఫిల్మ్ ఇన్టిస్టిట్యూట్ లో శిక్షణ పొందిన వారే అవడం విశేషం.

ఈ చిత్రాన్ని త్వరలో తెలుగులో కూడా విడుదల చేస్తున్నాం. తెలుగు కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఎస్. ఆర్. ఆర్ ప్రొడక్షన్స్ అధినేత పరుపాటి శ్రీనివాస రెడ్డి తెలుగులో విడుదల చేయనున్నారు’ అని అన్నారు. పూణే ఫిల్మ్ ఇన్టిస్టిట్యూట్ విద్యార్థులు నిర్మించిన ఈ చిత్రంలో ప్రజ్ఞన్ , వరుణ్ సింగ్ రాజ్ పుట్, స్థుతి, చయనిక తో పాటు పలువురు నటించారు. ఈ చిత్రానికి ఎడిటర్: శావని మోహిత్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే: జస్టిన్ థామస్, సినిమాటో గ్రఫీ :ఆరీఫ్, సంగీతం: నవీద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: గౌరవ్, ఆర్ట్ డైరెక్టర్: రుద్ర రోహిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సచిన్ కొత్వాల్, కో ప్రొడక్షన్: చార్లీ స్టూడియోస్, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి బాలాచారి, విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ ట్రస్ట్ ఛైర్మన్ సుందర్, రామసుబ్బారెడ్డి, సచిన్ కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.