బ్రహ్మాస్త్ర సినిమా ఒక మోడ్రన్ మైథాలజీ – అయాన్ ముఖర్జీ

247

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. తెలుగులో ఈ సినిమా “బ్రహ్మస్త్రం” పేరుతో రిలీజ్ కానుంది. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. 09.09.2022న రిలీజ్ కానున్న తరుణంలో అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర గురించి తెలిపిన వివ‌రాలు

బ్రహ్మస్త్ర సినిమాతో మీరు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు.?

బ్రహ్మస్త్ర సినిమా ద్వారా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ఫాంటసీ ఫిలిం చెయ్యాలనుకున్నపుడు నన్ను చాలా విషయాలు ఇన్స్పైర్ చేసాయి. మనదేశంలో ఉన్న సంస్కృతి , పురాణాలు , గొప్ప కథలను డైరెక్ట్ గా చెప్పకుండా నా పద్ధతిలో చూపించాను.
మీరు ఈ సినిమాను చూస్తున్నప్పుడు మన భారతదేశం యొక్క సోల్ , అలానే ఆధ్యాత్మికతను కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తారు.

బ్రహ్మస్త్రలో అమితాబ్ బచ్చన్ , అలియా భట్ , నాగార్జున లాంటి నటులు మీ సెలెక్షనా.?

నిజంగా చెప్పాలంటే కథను రాసుకున్నప్పుడే ఈ పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ , ఈ పాత్ర కోసం అలియా, అలానే ఈ పాత్ర కోసం నాగార్జున గారు కావాలి అనుకున్నాము. ఆయనకు కథను
చెప్పాము, ఆయనకు బాగా నచ్చింది.ఈ పాత్రకు నాగార్జున గారు పర్ఫెక్ట్ అనిపించింది. బ్రహ్మాస్త్ర చూస్తున్నప్పుడు ఇది మన సినిమా అనే అనుభూతి కలుగుతుంది.

ఈ సినిమాను మీరు మోడ్రన్ మైథాలజీ అని ఎలా చెప్తారు.?

ఈ సినిమా మోడ్రన్ ఇండియా 2022 లో జరుగుతుంది. అంటే ఇది ప్రస్తుత సినిమానే , బ్రహ్మాస్త్ర అనే టైటిల్ వినగానే కొంతమంది ఇది పీరియాడిక్ ఫిలిం అనుకుంటారు. కానీ కథ మాత్రం మోడరన్ ఫిలిం, ఈ సినిమాకి ఇన్స్పెరేషన్ ఇండియన్ మైథాలజీ. అందుకే దీనిని మోడరన్ మైథలాజి అని చెప్పాను.

మూడు భాగాలుగా రానున్న బ్రహ్మాస్త్ర లో ఫస్ట్ పార్ట్ గా శివ తీసుకోవడానికి కారణం.?

వాస్తవంగా చెప్పాలంటే నిజంగా కనెక్షన్ అంటూ ఏమి లేదు.
లార్డ్ శివ కి దేనినైనా సృష్టించడమే కాదు. తన మూడవ కన్నును తెరిస్తే దేనినైనా నాశనం చేసే శక్తీ కూడా ఉంది. ఈ కాన్సెప్ట్ లో బ్రహ్మాస్త్ర పవర్ ను ఎవరు కంట్రోల్ చెయ్యలేరు.

మన పురాణాల్లో చాలామంది సూపర్ హీరోస్ ఉన్నారు,

మీరు ముందుగా భారతీయ సినిమాకు వాళ్ళను పరిచయం చేస్తున్నారు. కానీ ఎందుకు ఇంత లేట్ అయింది.?

నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు చాలా త్వరగా చేసేయాలి అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు 10, 20 సంవత్సరాల క్రితం రాసిన కామిక్ బుక్స్ ఆధారంగా తీసినవే. వాటితోనే అంత కంటెంట్ క్రియేట్ చేసి ఆదరణ పొందినప్పుడు. ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు ఉన్న మన భారతీయ చరిత్రను యధార్ధంగా ఎందుకు చూపించలేము అనిపించింది. 2011 లో నాకు ఈ ఆలోచన వచ్చింది అలానే అప్పటినుండి ఇప్పటివరకు టెక్నాలిజీ కూడా బాగా డెవలప్ అయింది. అది కూడా కొంతవరకు కలిసొచ్చింది. అని చెప్తూ పలు ఆసక్తకరవిషయాలను ముచ్చటించారు.

స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని 09.09.2022న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Eluru Sreenu
P.R.O