హెబ్బా పటేల్ చేతులమీదుగా “బోగీ” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

183

పీసీ క్రియేషన్స్ పతాకంపై ప్రదీప్ చంద్ర నిర్మాతగా వరుణ్.K దర్శకత్వలో రూపొందుతున్న చిత్రం భోగి. సస్పెన్స్ కధాంశంతో, యూత్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం, షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ హీరోయిన్ హెబ్బ పటేల్, ప్రముఖ నిర్మాత డీఎస్ రావు, నటులు దర్శకు అవసరాల శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత్రికికేయులతో పలు విశేషాలను పంచుకుంది చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా డైరెక్టర్ వరుణ్ మాట్లాడుతూ ఈ రోజుల్లో మహిళలు ఎదుర్కుంటున్న సంఘటలను వివరిస్తూ, సున్నితమైన ఆశాలను నలుగురు మహిళలు ఏవిధంగా ఎదుర్కొన్నారు అనే త్రిల్లర్ కధాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు.

నిర్మాత ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ చిన్న చిత్రమైనా మంచి క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మింఛామనీ, ఒక మంచి చిత్రాన్ని చూసిన అనుభూతిని మీకు తప్పకుండా ఈ చిత్రం కలిగిస్తుందని అన్నారు. అతి త్వరలో ట్రయిలర్ ను, ఆ తర్వాత చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.

కాగా ఈ చిట్రంలో ప్రార్ధన, రాజ్యలక్ష్మి, శృతి, సిరి సిద్దు సతీష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా
ఛాయాగ్రహణం కారె సతీష్
సంగీతం ప్రదీప్ చంద్ర,
ఎడిటర్ సూర్య, సుహాస్ రాయుదు
సహా నిర్మాత కేవీ కనకేశ్వర రావు,
సాహిత్యం స్వాతి కిరణ్, రాజేష్ లోకనాధం .లోకనాదం
అఫీషియల్ స్పాన్సర్ : లలిత జ్యూవెలరీస్