రానా పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నుంచి డేనియల్ శేఖర్ మరో ప్రచార చిత్రం విడుదల

356

ఆడికన్నా గట్టిగా అరవగలను…ఎవడాడు…. అంటున్న ‘రానా‘ అలియాస్ డేనియల్ శేఖర్

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.

భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి నేడు ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు చిత్ర బృందం. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నుంచి ఆయన పోషిస్తున్న డేనియల్ శేఖర్ పాత్ర కు సంబంధించినదే ఈ ప్రచార చిత్రం. ‘భీమ్లా నాయక్’ పవన్ కళ్యాణ్ కూడా కనిపించే ఈ ప్రచార చిత్రాన్ని పరికిస్తే….

“వాడు అరిస్తే భయపడతావా

ఆడికన్నా గట్టిగా అరవగలను

ఎవడాడు….

దీనమ్మ దిగొచ్చాడా…

ఆఫ్ట్రాల్ ఎస్ ఐ

సస్పెండెడ్….” అంటూ డేనియల్ శేఖర్ పాత్రధారి రానా ఆవేశంగా ఎవరితోనో చిత్ర కథానుసారం సంభాషించటాన్ని ఇందులో చూడవచ్చు. ఈ సన్నివేశం ఉత్సుకతను రేకెత్తిస్తోంది.

‘భీమ్లా నాయక్‘ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్:‘నవీన్ నూలి
ఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్ కె చంద్ర