సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్

558

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, న‌భా న‌టేష్ హీరోహీరోయిన్స్ గా `కందిరీగ‌` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1గా సుబ్ర‌హ్మ‌ణ్యం నిర్మిస్తున్న చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా నిర్మాత జెమిని కిర‌ణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం ఏర్పాటుచేసిన విలేఖ‌రుల సమావేశంలో…

ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ `ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా రూపొంద‌బోతోంది. డిసెంబ‌ర్ 6 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, దుబాయ్, అబ్రాడ్ లో చిత్రీక‌రణ జ‌ర‌ప‌బోతున్నాం. వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం. యాక్టింగ్ కు మంచి స్కోప్ ఉన్న పాత్రలో సాయిశ్రీనివాస్ క‌నిపిస్తాడు. త‌న కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత బెల్లంకొండ సురేష్ గారికి, చిత్ర నిర్మాత సుబ్ర‌హ్మ‌ణ్యం గారికి ధ‌న్య‌వాదాలు. బిజీ షెడ్యూల్ లో కూడా మా సినిమాకు అంగీక‌రించిన దేవిశ్రీ ప్ర‌సాద్ గారికి కృత‌జ్ఞ‌త‌లు` అన్నారు.

హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ `ద‌ర్శ‌కుడు సంతోష్ కందిరీగ సినిమా నుండి పరిచయం. తనతో వ‌ర్క్ చేయ‌డం నా కుటుంబ స‌భ్యుల‌తో చేసిన‌ట్టుగా ఉంది. మంచి పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్ట‌ర్. నా గత చిత్రాలతో పోల్చితే ఇందులో కొత్త తరహా పాత్ర పోషిస్తున్నాను. సభా నటేష్ కూడా పెర్ఫార్మెన్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తోంది. అల్లుడు శీను, జ‌య‌జాన‌కి నాయ‌క త‌ర్వాత దేవిశ్రీ ప్ర‌సాద్ తో చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన వి.వి.వినాయ‌క్, దిల్ రాజు, జెమినీ కిర‌ణ్ గార్ల‌కి థ్యాంక్స్` అని అన్నారు.

నిర్మాత‌ సుబ్రమణ్యం మాట్లాడుతూ `నన్ను నిర్మాతగా పరిచయం చేస్తున్న బెల్లంకొండ సురేష్, పద్మ గార్లకి ధన్యవాదాలు. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ గా రూపొందిస్తున్నాం. డిసెంబర్ 6 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’ అన్నారు.

`ఇస్మార్ట్ బ్యూటీ` న‌భా న‌టేష్ మాట్లాడుతూ `సాయిశ్రీనివాస్ తో వ‌ర్క్ చేయ‌డానికి ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. న‌ట‌న‌కి ఆస్కార‌మున్న పాత్ర పోషించ‌నుండ‌టం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన‌ దర్శకనిర్మాతలకు కృత‌జ్ఞ‌త‌లు` అన్నారు.