పెద్దలతో పాటు పిల్లలు కూడా ‘బజార్ రౌడి’ చూడొచ్చు.. U/A సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు..

279


బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా కెఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కిన సినిమా బజార్ రౌడి. వసంత నాగేశ్వరరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్‌లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు సభ్యులు. పెద్దలు మాత్రమే కాదు.. చిన్న పిల్లలు కూడా హాయిగా సంపూర్ణేష్ బాబు సినిమా చూడొచ్చంటూ సెన్సార్ సభ్యులు చెప్పేసారు. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకోవడం ఖాయం అంటున్నారు చిత్ర యూనిట్. సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాశారు. గౌతంరాజు ఎడిటింగ్ చేసిన ఈ సినిమాకు SS ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆగస్ట్ 20న బజార్ రౌడి సినిమాను విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు.

నటీనటులు:
సంపూర్ణేష్ బాబు, సాయాజి షిండే, 30 ఇయర్స్ పృథ్వి, కత్తి మహేష్ తదితరులు..

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: వసంత నాగేశ్వరరావు
నిర్మాత: సంధిరెడ్డి శ్రీనివాసరావు
సమర్పణ: బోడెంపూడి కిరణ్ కుమార్
బ్యానర్: కె ఎస్ క్రియేషన్స్
మాటలు: మరుధూరి రాజా
సంగీతం: ఎస్ఎస్ ఫ్యాక్టరీ
ఎడిటింగ్: గౌతం రాజు
సినిమాటోగ్రఫీ: ఏ విజయ్ కుమార్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Eluru Sreenu
P.R.O