HomeTeluguఆద్యంతం హాస్య ప్రధానంగా భాస్కర్ ఒక రాస్కల్

ఆద్యంతం హాస్య ప్రధానంగా భాస్కర్ ఒక రాస్కల్

అరవిందస్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలలో సిద్ధికీ తమిళంలో రూపొందిన భాస్కర్ ఓరు రాస్కల్ ఇప్పడు తెలుగులో భాస్కర్ ఒక రాస్కల్ పేరుతో రాబోతోంది. కార్తికేయ మూవీస్ పతాకంపై పఠాన్ చాన్ బాషా అందిస్తున్న ఈ చిత్రం నవంబర్ నెలలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత పఠాన్ చాన్ బాషా మాట్లాడుతూ, ఇదే చిత్రాన్ని తొలుత మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా దర్శకుడు సిద్ధికీ రూపొందించారు. అక్కడ విజయం సాధించడంతో సిద్ధికీ మళ్లీ తన దర్శకత్వంలోనే నటీనటుల మార్పుతో తమిళ తెరకెక్కించారు. తమిళంలో కూడా ఈ చిత్రానికి ప్రేక్షక ఆదరణ లభించడంతో తెలుగులో విడుదల చేసేందుకు పూనుకున్నాను. తోడు లేని ఇద్దరు వ్యక్తులు ఎలా కలిశారు. వారు అలా కలిసేందుకు ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేసారు అన్న ఆసక్తి దాయకమైన ఇతివృత్తంతో ఆద్యంతం హాస్య ప్రధానంగా ఈ చిత్రం ఉంటుందని…ఊహించని ఓ ట్విస్ట్ ప్రేక్షకులను ఎంతగానో అలరింప చేస్తుందని నిర్మాత పఠాన్ చాన్ బాషా వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, సీనియర్ నటి మీనా కుమార్తె బేబీ నైనిక ఓ ప్రధాన భూమిక పోషించింది. అరవిందస్వామి, అమలాపాల్ తమ పాత్రలలో అద్భుతమైన నటనను కనబరిచారు. అమ్రిష్ గణేష్ సమకూర్చిన సంగీతం ఆకట్టుకుంటుంది. నవంబర్ రెండో వారంలో ఆడియోను, ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తాం. అదే నెలలో సినిమాను విడుదల చేస్తాం అని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో నాజర్, నికీషా పటేల్, రోబో శంకర్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి నిర్మాత: పఠాన్ చాన్ బాషా. దర్శకత్వం: సిద్ధికీ

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES