మీకు మాత్రమే చెప్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ. !!!*

524

*కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చెయ్యడం నా బాధ్యత, సినిమా ఔట్ పుట్సం తృప్తిని ఇచ్చింది. మీకు మాత్రమే చెప్తా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్దే వరకొండ. !!!*

తరుణ్‌ భాస్కర్‌ హీరోగా షామీర్ సుల్తాన్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నిర్మించిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’ ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్హై దరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్, సురేష్ బాబు, మధురా శ్రీధర్, కె.ఎస్.రామారావు, పరుశురాం, శివ నిర్వాణ, ఛార్మి, తరుణ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

*ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ…* కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త టెక్నీషియన్స్ అందరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. మా సినిమాను దీవించడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా నిర్మాత సురేష్ బాబు గారికి థాంక్స్, ఆయన నా మొదటి సినిమా నుండి సపోర్ట్ చేస్తున్నారు. డైరెక్టర్స్ పూరి గారు, పరుశురాం, శివ నిర్వాణ నాకోసం ఈ ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది.

*డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ…* విజయ్ దేవరకొండ డాడీ గోవర్ధన్ మంచి వ్యక్తి మేము కలిసి వర్క్ చేశాము. విజయ్ చేస్తున్న ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్న. ట్రైలర్బా గుంది, సినిమాలో నటించిన అందరూ నటీనటులు బాగా యాక్ట్ చేశారు. విజయ్దే వరకొండ చేస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్న. మీ లాగే నేను మీకు మాత్రమే చెప్తా సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను, ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్న అన్నారు.

*తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ…* నేను ఎదుగుతున్న సమయంలో మా నాన్న సపోర్ట్ మరువలేనిది. నాకు నటన అనేది ఇష్టం కావున నేను నటుస్తూ వెళుతున్న. డైరెక్టర్ షమ్మిర్ బాగా కష్టపడి ఈ సినిమా తీశారు. విజయ్ దేవరకొండ చేస్తున్న అన్ని ప్రయత్నాలు సక్సెస్కా వాలని కోరుకుంటున్న, తాను నిర్మించిన ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

*నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ…* అందరికి నమస్కారం. విజయ్, తరుణ్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ పర్సన్స్, వారు ఎదిగిన విధానం చూస్తుంటే ముచ్చటగా ఉంది. మీకు మాత్రమే చెప్తా ట్రైలర్చూ శాను బాగా నచ్చింది. చిన్న సినిమాలను సపోర్ట్ చేసే విజయ్ దేవరకొండకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. నవంబర్ 1న విడుదల కాబోతున్న ఈ సినిమాను అందరూ చూసి హిట్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.

*నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ…* నేను ఈ సినిమా చూశాను, నాకు బాగా నచ్చింది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. కామెడీ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆధారిస్తూ ఉంటారు.ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది. సినిమా సక్సెస్ అవుతుందని ముందే చిత్ర యూనిట్స భ్యులకు కంగ్రాట్స్ చెబుతున్నాను అన్నారు.

*డైరెక్టర్ షామీర్ మాట్లాడుతూ…* నాకు ఈ సినిమా చెయ్యడానికి అవకాశం ఇచ్చిన విజయ్ దేవరకొండ, వర్ధన్ గారికి థాంక్స్. తరుణ్ భాస్కర్ రాకేష్ పాత్రలో ఎనర్జీ గా నటించాడు, షూటింగ్స మయంలో తను నాకు బాగా సపోర్ట్ చేసాడు. మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాల సినిమా కోసం కష్టపడి పనిచేశారు. అభినవ్, అనసూయ పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయి. మీకు మాత్రమే చిత్రం విడుదల తరువాత అందరి పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ఆడియన్స్ సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేస్తారన్నారు.

*హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ..* మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. మంచి కథ, కథనాలతో ఈ సినిమా ఉండబోతోంది, మీ అందరికి నా రోల్ నచ్చుతుందని అనుకుంటున్నాను అన్నారు.