`రూల‌ర్‌` చిత్రాన్ని విజ‌యంతం చేసిన ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు: నంద‌మూరి బాల‌కృష్ణ‌

537

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.కల్యాణ్ నిర్మించిన చిత్రం `రూల‌ర్‌`. డిసెంబ‌ర్ 20న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఆదివారం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో… నిర్మాత సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ – “జైసింహా త‌ర్వాత మ‌రోసారి మా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రూల‌ర్ సినిమాను హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌. రాంప్ర‌సాద్‌గారు సినిమాను అద్భుతంగా విజువ‌లైజ్ చేసి చూపించారు. డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా ఎంతగానో హెల్ప్ చేశారు. ఐదు నెల‌లు పాటు టీం అంద‌రం ఎంత‌గానో హార్డ్ వ‌ర్క్ చేశాం. మ‌ళ్లీ నెక్ట్స్ సినిమాను కూడా దీని కంటే మంచి సిన‌మా ఇస్తాన‌ని తెలియ‌జేస్తున్నాను“ అన్నారు.
నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ – “రూల‌ర్ సినిమాకు విజయాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌. ఓ మంచి ప్ర‌య‌త్నం చేశాం. మా ప్ర‌య‌త్నానికి విజయాన్ని అందించారు ప్రేక్ష‌కులు. క‌ల్యాణ్‌గారు ఖ‌ర్చుకు ఎక్క‌డా కాంప్రైజ్ కాలేదు. క‌ల్యాణ్‌గారితో నేను చేసిన మూడో సినిమా. మంచి క‌థా విలువ‌లున్న సినిమా చేయాల‌ని భావించే నిర్మాత ఆయ‌న‌. ఆయ‌న‌కు నా త‌రపున‌, అభిమానుల త‌ర‌పున కృత‌జ్ఞ‌తలు. వి.ఎస్‌.ఆర్‌.స్వామిగారి వ‌ద్ద శిష్య‌రికం చేసిన రాంప్ర‌సాద్‌గారు ఈ సినిమాకు మంచి విజువ‌ల్స్‌ను అందించారు. ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు. హీరోయిన్స్‌ సోనాల్‌, వేదిక చ‌క్క‌గా న‌టించారు. జ‌య‌సుధ‌గారు, ప్ర‌కాష్‌రాజు, స‌ప్త‌గిరి, ధ‌న్‌రాజ్‌, ర‌ఘు గారు అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. ప‌రుచూరి ముర‌ళిగారు మంచి క‌థ‌ను అందించారు. మంచి డైలాగ్స్‌ను కూడా అందించారు. మంచి మెసేజ్‌ను కూడా ఈ క‌థ‌లో చొప్పించారు ముర‌ళిగారు. ఆయ‌న‌కు థ్యాంక్స్‌. డైరెక్ట‌ర్ కె.ఎస్‌.ర‌వికుమార్‌గారు ఆర్టిస్టుల ద‌గ్గ‌ర నుండి ఏం కావాలో ఆ న‌ట‌న‌ను రాబ‌ట్టుకునే ద‌ర్శ‌కుడు. అలాగే నిర్మాత‌ల ద‌ర్శ‌కుడు కూడా ఆయ‌న‌. చిరంత‌న్ భ‌ట్‌తో నేను చేసిన మూడో సినిమా. అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు“ అన్నారు.