పూజ కార్యక్రమాలతో ప్రారంభమైన “కోతీ బావకు పెళ్లంట”.

336

శ్రీ దుర్గా మూవీస్ సమర్పణలో  వంశీ ఆలూర్, సునీల్, అలీ, నరేష్ వికె, పృథ్వీ, అమర్‌దీప్, రఘు బాబు, తనికెళ్ల భరణి నటీనటులు గా అశోక్ కుమార్ దర్శకత్వంలో శ్రీ దుర్గా మూవీస్  నిర్మిస్తున్న చిత్రం” కోతీ బావకు పెళ్లంట”.ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జర్నలిస్ట్ కాలనీలో గల శ్రీ దుర్గా మూవీస్ కార్యాలయంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన తెలంగాణ FDC ఛైర్మన్ రామ్ మోహన్ రావు గారు హీరో పై,తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా ,నటుడు తనికెళ్ల భరణి కెమెరా స్విచ్ ఆన్ చేసారు, మరియు అవసరాల శ్రీనివాస్ ఫస్ట్ షాట్ డైరెక్టన్ చేసారు. అనంతరం

FDC ఛైర్మన్ రామ్ మోహన్ రావు గారు మాట్లాడుతూ.. మంచి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సీనియర్ నటులు చాలా మంది ఉన్నారు. అద్భుతమైన సంగీత దర్శకుడు కోటి గారు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అశోక్ కుమార్ గారు నటుడుగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మంచి కథను సెలెక్ట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్న అశోక్ కుమార్ కు, చిత్ర నిర్మాతకు,చిత్ర యూనిట్ అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

నటుడు తనికెళ్ళ భరణి మాట్లాడుతూ..  ఈ మధ్య వస్తున్న కొత్త దర్శకులు ప్రేక్షకులను ఆలోచించే విధమైన కొత్త కథలతో, కథనాలతో సినిమాలు తీసి విజయం సాధిస్తున్నారు.అలాగే మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో నేను బాగమవు తున్నందుకు అందంగా ఉంది అన్నారు.

నటుడు, చిత్ర దర్శకుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ .. మా “కొతీ బావకు పెళ్ళంట” సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మంచి కాన్సెప్ట్ తో  బ్యూటిఫుల్ కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ,లవ్ ఏంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాము. ఇప్పటి వరకు తెరపై చూడని ఈస్ట్ గోదావరి లోని  అందమైన లోకేషన్స్ తో పాటు కోనసీమ అందాలను కూడా ప్రేక్షకులకు చూపిస్తున్నాము. రావులపాలెం, ఆత్రేయపురం, హైదరాబాద్ లలో షెడ్యూల్ జరుపుకొనున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

చిత్ర కో ప్రొడ్యూసర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ..మేము చేస్తున్న ఈ  సినీమాకు తెలంగాణ FDC ఛైర్మన్ రామ్ మోహన్ రావు గారు, నటుడు తనికెళ్ల భరణి , అవసరాల శ్రీనివాస్ గార్లు రావడం చాలా సంతోషంగా ఉంది. అశోక్ కుమార్ గారు చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. మా సినిమాకు మంచి క్యాస్ట్ & క్రూ దొరికారు. మంచి కథతో వస్తున్న “కొతీ బావకు పెళ్ళంట” సినిమా మీ అందరు బ్లెస్సింగ్ తో గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు

హీరో వంశీ ఆలూర్ మాట్లాడుతూ ..”సీనియర్ నటులతో నటిస్తున్నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. “కొతీ బావకు పెళ్ళంట” వంటి మంచి కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ చిత్రం గొప్ప విజయం సాదించాలని అన్నారు.

నటీనటులు
వంశీ ఆలూర్, సునీల్, అలీ, నరేష్ వికె, పృథ్వీ, అమర్‌దీప్, రఘు బాబు, తనికెళ్ల భరణి తదితరులు

సాంకేతిక నిపుణులు
ప్రెజెంట్స్ : శ్రీ దుర్గా మూవీస్
దర్శకుడు : అశోక్ కుమార్
డైలాగ్స్ : నడిమింటి నరసింగరావు
సంగీతం : కోటి
డిఓపి : తోట రమణ
పి ఆర్ ఓ.: లక్ష్మీనివాస్