బిగ్ బాస్ ఫేం, యంగ్ ట్యాలెంటెడ్ అర్జున్ కళ్యాణ్, కుషితకల్లపు హీరో హీరోయిన్స్ గా లక్ష్మణ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం బాబు నెం1 బుల్ షిట్ గయ్. డీడీ క్రియేషన్స్ బ్యానర్ పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో బేబీ చిత్ర నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత వివేక్ కూచిభొట్ల ముఖ్య అతిధులుగా హాజరైన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుక గ్రాండ్ గా జరిగింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు సాయిరాజేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా అనిపించింది. నాకు చాలా నచ్చింది. ఒకే ట్రైలర్ లో విభన్న ఎమోషన్స్ ని చూపించడం బావుంది. సినిమాకి చాలా మంచి పాజిటివ్ బజ్ వుంది. అర్జున్ కళ్యాణ్ లో ఎప్పుడూ ఫైర్ తో ఉంటాడు. తనలో ఆ క్యాలిటీ నాకు చాలా నచ్చుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలి’ అని కోరారు.
నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. డీడీ క్రియేషన్స్ పెద్ద బ్యానర్ అవ్వాలి. అర్జున్ కళ్యాణ్ చాలా కష్టపడి పని చేసే తత్త్వం వున్న నటుడు. ఆయన ఇంకా పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కుషితకి కూడా మంచి భవిష్యత్ వుంది. ఈ సినిమా ట్రైలర్ చాలా బావుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. అంచెలంచెలుగా ఎదుగుతున్న అర్జున్ కళ్యాణ్ కి బెస్ట్ విషెష్. దర్శకుడు లక్ష్మణ వర్మ, నిర్మాత, సంగీత దర్శకుడు అందరికీ ఆల్ ది బెస్ట్. తెలుగమ్మాయి కుషిత మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. సినిమా పెద్ద విజయం సాధించాలి’ అని కోరారు
హీరో అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా కష్టపడి చేశాం. మూడు భాషల్లో ఈ సినిమా చేశాం. దీనికి కారణం నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా చేశారు. టీం అంతా చాలా ప్యాషన్ తో వర్క్ చేసింది. మంచి టీం వర్క్, ప్లాట్ లైన్ తో ఈ సినిమా చేశాం. యూనిక్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్, డ్రామా వున్న కథ ఇది. చాలా డిఫరెంట్ గా చేశాం. ప్రేక్షకుల తప్పకుండా ఆదరించాలి’ అని కోరారు
హీరోయిన్ కుషితకల్లపు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరో ఫ్యామిలీతో కూర్చుని చూడదగ్గ మూవీ ఇది. తప్పకుండా థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాలి’ అని కోరారు.
దర్శకుడు లక్ష్మణ వర్మ మాట్లాడుతూ.. డీడీ క్రియేషన్స్ ఈ సినిమా మరో స్థాయికి తీసుకెళ్ళింది. దిలీప్ గారు ఎక్కడా రాజీపదకుండా ఈ సినిమాని నిర్మించారు. అర్జున్ కళ్యాణ్, కుషితకల్లపు చాలా హార్డ్ వర్క్ చేశారు, ప్రమోషన్స్ ని కూడా ఎంతో ఆసక్తిగా చేస్తున్నారు. టీం అందరికీ థాంక్స్” తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
తారాగణం: అర్జున్ కళ్యాణ్ కుషితకల్లపు, లక్ష్మణ్ వర్మ, సోనాలి పానిగ్రాహి, మురళీధర్ గౌడ్ , భద్రం, రవి వర్మ, జబర్దస్త్ అప్పారావు, బద్రి, సునీత మనోహర్ , బేబీ ఆరాధ
టెక్నికల్ టీం:
బ్యానర్ – డీడీ క్రియేషన్స్
నిర్మాత – దండు దిలీప్ కుమార్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత – డి లక్ష్మీ నారాయణ (బుజ్జి)
దర్శకుడు – MLR (లక్ష్మణ వర్మ)
D.O.P – PS మణికర్ణన్
ఎడిటర్ – డి వెంకట ప్రభు
సంగీత దర్శకుడు – పవన్
ఆదిత్య మ్యూజిక్ – మాధవ్ & నిరంజన్
ఈవెంట్ పార్టనర్ – హనుమాన్ డిజిటల్ మీడియా
డిజిటల్ పార్టనర్ – సిల్లీ మాంక్స్
ప్రొడక్షన్ కంట్రోలర్: అమ్మ సీను
పీఆర్వో: తేజస్వీ సజ్జా
Trailer Link : https://youtu.be/27lPHI5N9R4?si=uy6Q07UkwIAN0txI
Regards,
Tejaswi Sajja