యువ కథానాయకుడు నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం `అర్జున్ సురవరం`. బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై టి.సంతోష్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 29న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. నవంబర్ 26న ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పీపుల్స్ ప్లాజాలో నిర్వహింంచారు. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిగ్ టికెట్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా..
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – “ఈ ఫంక్షన్‌కి నేను రావడం చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను బిజీగా ఉంటాను కాబట్టి నన్ను ఫంక్షన్‌కి రమ్మని ‘ఠాగూర్’ మధు ఇబ్బంది పెట్టరు. మరి ఎవరి ప్రభావంతో.. ఎవరి ప్రమేయంతో వచ్చానన్నది చాలా మందికి అనుమానం ఉండొచ్చు. ఇప్పటి వరకూ ఏ ఫంక్షన్‌కైనా నన్ను పిలిస్తే వెళ్లాను. కానీ, ‘అర్జున్ సురవరం’ సినిమాకి ఫంక్షన్ పెట్టుకోండి, ముఖ్య అతిథిగా వస్తానని చెప్పి మరీ పెట్టించుకున్నా(నవ్వుతూ). నిజం చెప్పాలంటే ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన తర్వాత నేనే రావాలనుకున్నా. ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని వచ్చా. నిర్మాత రాజ్‌కుమార్ మరొక ప్రధానమైన కారణం. ఎక్కడైనా పైరసీ జరుగుతుంటే సైబర్ పోలీసుల్లా వెళ్లి తనకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని పూర్తీగా ధ్వంసం చేసి, ఇండస్ట్రీకి గొప్ప సహాయం చేస్తున్నాడు.
చిత్ర దర్శకుడు టి.సంతోష్ మాట్లాడుతూ – ‘‘ తెలుగులో నా తొలి చిత్రమిది. మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన చిరంజీవిగారికి, ఆయన అభిమానులకు థ్యాంక్స్. చాలా మంది నన్ను అడిగారు అర్జున్ సురవరం అంటే ఏంటి? అని అర్జున్ అంటే క్లీన్. ఈ సినిమాలో అర్జున్ క్యారెక్టర్ క్లీన్, ప్యూర్ రిపోర్టర్. సురవరం అనేది సీనియర్ జర్నలిస్ట్ సురవరం ప్రతాప రెడ్డి గారి ఇన్స్పిరేషన్ తో తీసుకోవడం జరిగింది. అలాగే మా నిర్మాతలు మధు, రాజ్ కుమార్ గారికి థాంక్స్” అన్నారు.