జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ 18 పేజీస్ లో డైనిమిక్ హీరో నిఖిల్ కి జోడిగా అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్

596

 
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ స్టార్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు పై టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ తెర‌కెక్కిస్తున్న చిత్రం 18 పేజీస్. అర్జున్ సుర‌వరం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత నిఖిల్ 18 పేజీస్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి, వాటితో పాటే తాజాగా చిత్ర బృందం నిఖిల్ కి ఈ సినిమాలో జోడిని కూడా ఎంపిక చేశారు. అటు త‌న అభిన‌యంతో ఇటు త‌న అందాల‌తో తెలుగు కుర్ర‌కారు హృద‌యాల్ని దోచుకుంటున్న మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసు‌కున్న‌ట్లుగా 18 పేజీస్ టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. చాలా రోజులు త‌రువాత అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ స్టోరీ నచ్చి ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించ‌డం విశేషం. ఇక నిఖిల్, అనుప‌మ జోడి ఆన్ స్క్రీన్ అద్భుతంగా క‌నిపిస్తొంద‌ని, వారి క్యారెక్ట‌ర్లు కూడా ఆడియెన్స్ ని ఆద్యంతం అల‌రించేలా తీర్చిదిద్దుతున్న‌ట్లుగా చిత్ర ద‌ర్శ‌కుడు సూర్య ప్ర‌తాప్ తెలిపారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నారు. జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై గ‌తంలో భ‌లే భలే మ‌గాడివోయ్, గీత‌గోవిందం, ప‌త్రిరోజూపండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు తెర‌కెక్కాయి, ఇప్పుడు నిఖిల్, అనుప‌మ కాంబినేష‌న్ లో రెడీ అవుతున్న 18 పేజీస్ పై అంతటా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.
న‌టీన‌టులు
నిఖిల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం
స‌మ‌ర్ప‌ణ – అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ – జీఏ 2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్
క‌థ‌, స్క్రీన్ ప్లే – సుకుమార్
మ్యూజిక్ – గోపీ సుంద‌ర్
నిర్మాత – బ‌న్నీ వాసు
ద‌ర్శ‌క‌త్వం – ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్
Anupama Parameswaran to pair with Nikhil in 18 Pages
18 Pages, to be presented by mega producer Allu Aravind and produced by successful producer Bunny Vas will have talented director Palnati Surya Prathap at the helm. The pre-production activities of the film are being carried out at a brisk pace and the makers have locked the female lead of the film. Young and talented Malayali actress Anupama Parameswaran has been officially announced as the female lead in 18 Pages. The on-screen chemistry between Nikhil and Anupama will be an eye feast, opines the director Surya Prathap. Ace director, Sukumar is providing the story and screenplay for the film. National award winning music composer Gopi Sundar will be scoring the tunes.
Lead cast: Nikhil, Anupama Parameswaran, etc.
Technical crew:
Presented by: Allu Aravind
Banner: GA 2 Pictures, Sukumar Writings
Story and screenplay: Sukumar
Music: Gopi Sundar
Producer: Bunny Vas
Director: Palnati Surya Prathap