‘అనిల్ పంగులూరి’ దర్శకత్వంలో !!

573


శేఖర్ కమ్ముల మొదలుకుని గౌతమ్ తిన్ననూరి వరకు పలువురు ఐ.టి.రంగ నిపుణులు తెలుగు సినిమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తాజాగా తెలుగు చిత్రసీమకు ఐ.టి.రంగం నుంచి మరో ప్రతిభాశాలి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. పేరు.. ‘అనిల్ పంగులూరి’. యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్-శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఓ ఆహ్లాదభరిత చిత్రం ద్వారా అనిల్ పంగులూరి దర్శకుడిగా పరిచయం కానున్నారు. దర్శకనిర్మాతల ఉత్తమాభిరుచికి అద్దం పడుతూ.. తెలుగుదనం ఉట్టి పడే పేరును ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం పేరును త్వరలోనే ప్రకటించనున్నారు. గుండెల్ని మెలిపెట్టే గాఢమైన అనుభూతుల్ని పంచి.. పలు రకాల భావోద్వేగాలతో మనసుల్ని రంజింపచేసి.. చాలా రోజుల తరువాత మళ్ళీ మరో మంచి సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చే చిత్రాన్ని అందించనున్నామనే నమ్మకం, గర్వం మాకుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
దాదాపుగా అందరూ కొత్తవాళ్ళతో రూపొందుతున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్. వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసడ, ఛాయాగ్రహణం: సంతోష్ షనమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, సహ నిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, సమర్పణ: పద్మనాభరెడ్డి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి.

Attachments area