HomeTeluguసినీ అతిరదుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ అయిన మరో నిర్మాణ సంస్థ ASR (...

సినీ అతిరదుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ అయిన మరో నిర్మాణ సంస్థ ASR ( Amezing Screen Reels )

భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే థియేటర్స్ లలో విడుదల అవుతూ చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలకు నోచుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆటువంటి వారికి చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ వ్యాపార వేత్త బి.శ్రీ రంగం శ్రీనివాస్(GSR).తను చేపట్టిన ప్రతి పని లోను సక్సెస్ సాధిస్తూ బిజినెస్ రంగంలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు.తనకు సినిమా మీద ఉన్న మక్కువతో సినిమానే ప్రాణంగా భావించి నూతనంగా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ”ASR ”( Amezing Screen Reels ) పేరుతో సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారు ఈ సందర్బంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సముద్ర, నిర్మాతలు శోభారాణి ,లగడపాటి శ్రీనివాస్, అర్జున్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బి. సత్యనారాయణ, యల్. బి. నగర్ పి. వి. కె మల్టీప్లెస్ ఓనర్ పి. విజయ్ కుమార్, తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని ASR లోగోను గ్రాండ్ గా విడుదల చేశారు.
అనంతరం

డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ రోజున డి.రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్, నాగేశ్వరావు స్థాపించిన అన్నపూర్ణ, సూపర్ గుడ్ ఫిలిమ్స్, దిల్ రాజు, మైత్రి మూవీస్, సితార ఎంటర్టైన్మెంట్స్ ఏవియం ప్రొడక్షన్ సంస్థలు ఎన్నో సినిమాలు నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నాయి. ఆ సంస్థలాగే ఇప్పుడు వచ్చిన ASR సంస్థ మంచి చిత్రాలు నిర్మిస్తూ ఒక గొప్ప సంస్థగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత శోభారాణి మాట్లాడుతూ. ”ASR ”( Amezing Screen Reels ) పేరు చాలా అద్భుతంగా ఉంది. వరల్డ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ. మంచి, చెడు నేర్పించేది సినిమా. ఇలాంటి సినీ ఇండస్ట్రీని కొన్ని లక్షల మంది నమ్ముకొని జీవిస్తున్నారు.వారిలోని ట్యాలెంట్ ఉన్న వారికి సపోర్ట్ గా నిలవడానికి ASR ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా ఒక అమ్మలాంటిది.
అలాంటి సినిమా ఫీల్డ్ అక్కున చేర్చుకుంటే ఆకాశానికి హద్దు లేదు అన్నట్లు ఉంటుంది. మీరు స్థాపించిన సంస్థ గొప్ప విజయం సాధించాలని, అలాగే మంచి చిత్రాల తీసి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ASR వ్యవస్థాపకులు శ్రీరంగం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ..ఈ రోజు సినీ ప్రముఖులు అందరూ వచ్చి మా ”ASR ”( Amezing Screen Reels ) లోగోను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు సినిమా అంటే ఇష్టం.సినిమా మీద ఉన్న మక్కువతో సినిమానే ప్రాణంగా భావించి యంగ్ న్యూ టాలెంటెడ్ డైరెక్టర్స్, రైటర్స్, సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్స్ & ఎగ్జి బ్యూటర్స్ అందరికీ సపోర్ట్ గా నిలవాలని “ASR “సంస్థను స్థాపించడం జరిగింది.వెయ్యి అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది. ఆలా మా మొదటి అడుగు మీ అందరి ఆశీర్వాదం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సంస్థ ద్వారా అనేక సినిమాలు కూడా నిర్మించి మంచి పేరు తెచ్చుకుంటామని అన్నారు.

అజయ్ మాట్లాడుతూ..ఇక్కడకు వచ్చిన పెద్దలందరికీ మా ధన్యవాదాలు. ASR సంస్థను స్థాపించాలనే మా కల. ఇండస్ట్రీలో మాకున్న అనుబంధంతో ఈ కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ASR లో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్, రైటర్స్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కానీ, కొత్తగా సినిమాలు నిర్మించిన నిర్మాతలకు ఉపయోగపడాలనేదే మా ముఖ్య ఉద్దేశం.ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బందులు అన్నీ శ్రీరంగం శ్రీనివాస్ గారికి వివరించడం జరిగింది.పెద్ద ఆశయాలతో మొదలుపెట్టిన మా ASR సంస్థను ముందుకు తీసుకు వెళ్తామని శ్రీనివాస్ గారికి హామీ ఇస్తున్నాము. సినిమా మీద ఉన్న ఫ్యాషన్ ఉన్న యంగ్ టాలెంటెడ్ రైటర్, డైరెక్టర్, ఎగ్జిబిటర్స్ ఇలా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికీ మా సంస్థ ఉపయోగ పడుతుంది.

శ్రీనాథ్ మాట్లాడుతూ.. మా ASR సంస్థ ఇక్కడ ఉన్న ప్రతి టెక్నీషియన్స్ అందరికీ జరగబోతుంది. రానున్న కొన్ని నెలల్లో ప్రతి ఒక్కరూ మా బ్యానర్ ద్వారా సంతోషంగా ఉంటారు

నిర్మాత శాంతయ్య (సత్యనారాయణ )మాట్లాడుతూ.. న్యూ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చిన ASR సంస్థ అంచెలంచెలుగా ఎదుగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES