సెన్సేషన్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా గ్రాండ్ గా “దోచేవారెవరురా” ట్రైలర్ విడుదల.

138

మార్చి11. న ప్రేక్షకుల ముందుకు వస్తున్న కామెడీ, ఎంటర్‌టైనర్ “దోచేవారెవరురా..”

IQ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రణవచంద్ర ..మాళవిక సతీషన్ అజయ్ గోష్. బిత్తిరి సత్తి ..మాస్టర్ చక్రి. జెమిని సురేష్. నటీ నటులుగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు దర్శకత్వంలో బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం “దోచేవారెవరురా”.ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు ..తనికెళ్ళ భరణి,.బెనర్జీ అతిధి పాత్రలలో  కనిపించనున్నారు. ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్ వర్మ గారు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు, దర్శక ధీరుడు రాజమౌళి  విడుదల చేసిన టీజర్ కు, దర్శకులు సుకుమార్, అనిల్ రావి పూడి, విజయేంద్ర ప్రసాద్ లు విడుదల చేసిన పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 11. న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయగా.. నటులు ఉత్తేజ్, హర్ష వర్ధన్, దర్శకులు ప్రణీత్ లు చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెష్ తెలియజేశారు.

దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ప్రతి హీరో లో ఒక డైరెక్టర్ ఉంటాడు. ప్రతి డైరెక్టర్ లో ఒక హీరో ఉంటాడు. అయితే వీరిలోని వారు , వారి లోని వీరు బయటకు రాకూడదు అని ఒక సందర్భంలో చెప్పారు. అలాగే చాలా మంది సినిమాను సెలెక్ట్ చేసుకున్నాం అంటారు. కానీ సినిమా మీద ప్యాషన్ ఉన్నవాడిని సినిమానే మనల్ని సెలెక్ట్ చేసుకుంటుంది తప్ప సినిమాను మనం సెలెక్ట్ చేసుకోము .శివ నాగేశ్వరావు గారు చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి తనకున్న సెన్సాఫ్ హ్యూమర్ మాకు కూడా లేదు. తను ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాడు.మళ్ళీ ఇప్పుడు మంచి కథతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి. ఇందులో నటించిన నటులకు, టెక్నిషియన్స్ కు, నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు శివ నాగేశ్వరావు మాట్లాడుతూ.. మా ట్రైలర్ ను విడుదల చేయడానికి వచ్చిన హరీష్ శంకర్, ఉత్తేజ్, దర్శకులు ప్రణీత్, నటుడు హర్ష వర్ధన్ లకు థాంక్స్. షూట్ లో ఊన్న రవితేజ సినిమా చంచల్ గూడ జైల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు తనను కలవడానికి వెళ్లే వాన్ని, అక్కడ దర్శకుడు హరీష్ చేస్తున్న ఒక షార్ట్ బై షార్ట్ ను అబ్జర్వ్ చేసి నువ్వు ఫ్యూచర్ లో గొప్ప డైరెక్టర్ అవుతావు అన్నాను. ఇప్పుడు తనే నా సినిమాకు గెస్ట్ గా వచ్చాడు.ఈ సినిమా విషయానికి వస్తే ఈ కథ మొత్తం డబ్బుకు సంబందించిన అంశం చుట్టూ జరుగుతుంది. ప్రస్తుత సమాజంలో ఇంటినుండి బయటికి వచ్చిన తరువాత మనల్ని రకరకాలుగా దోచుకుంటున్నారు. ఇంతకు ముందు ఎవర్ని దోచుకోవాలో సెలెక్ట్ చేసుకొని వారిని దోచుకొనే వారు. ప్రస్తుతం మనల్ని ఎవరు దోచుకోవాలో వారిని మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఒక్క ఓటు వేసి.అయితే ఇది పొలిటికల్ సినిమా కాదు ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ తో పాటు ఫుల్ ఔట్ & ఔట్ కామెడీ థ్రిల్లర్ కూడా ఉంటుంది.ఇందులో నటించిన వారంతా చాలా బాగా నటించారు. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ సామెతంగా కూర్చొని చూడదగ్గ సినిమాగా తెరకెక్కించడం జరిగింది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

చిత్ర నిర్మాత బొడ్డు కోటేశ్వర రావు మాట్లాడుతూ…శివ నాగేశ్వరరావు గారి సినిమాలలో ఉన్న కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.ఇప్పుడు మంచి కాన్సెప్ట్ తో మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా “దోచేవారెవరురా” సినిమాలో కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని నమ్ముతున్నాను. మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ.. శివ నాగేశ్వరావు దగ్గర నేను అక్షరాలు నేర్చుకొన్నాను.తన దగ్గర చాలా నేర్చుకొన్నాను. ఆర్. జీ.వి గారు శివ సినిమా తీసి ట్రెండ్ సెట్ చేసిన టైంలో శివ నాగేశ్వరావు గారు కిడ్నాపింగ్ బ్యాక్ డ్రాప్ తో కామెడీ సెంటిమెంట్ తో “మనీ” లాంటి సినిమా తీసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు.ఇలా తను ఎన్నో సినిమాలు నిర్మించిన శివ నాగేశ్వరావు గారు ఇప్పుడు తీస్తున్న “దోచేవరెవరురా..” సినిమా కూడా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

డైరెక్టర్ ప్రణీత్ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుంది.మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

అజయ్ ఘోష్ మాట్లాడుతూ..ఇందులో నేను డ్యూయల్ రోల్ లో నటించాను. ఇంటిల్లి పాధి చూసే విధంగా తెరకెక్కిన ఈ సినిమాలో అందరూ చలా బాగా నటించారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

చిత్ర హీరో ప్రణవ్ చంద్ర మాట్లాడుతూ..డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న నన్ను హీరోగా పరిచయం చేసిన శివనాగేశ్వరావు గారికి ధన్యవాదములు. అయన దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ చాలా సరదాగా సాగింది.మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

జెమిని సురేష్ మాట్లాడుతూ.. మార్చి 11. న ప్రేక్షకుల ముందుకు వస్తున్న “దోచేవారెవరురా..” సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మనసులను కూడా దోచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ మాళవిక సతీషన్ మాట్లాడుతూ..మా సినిమా ట్రైలర్ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు

ప్రణతి మాట్లాడుతూ..షార్ట్ రీల్స్ నుండి సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటి నటులు:
ప్రణవచంద్ర ..మాళవిక సతీషన్ ..అజయ్ గోష్. ..ప్రణతి..బిత్తిరి సత్తి ..మాస్టర్ చక్రి. జెమిని సురేష్. అతిధి పాత్రలలో కోట శ్రీనివాసరావు ..తనికెళ్ళ భరణి ..బెనర్జీ ..,

టెక్నీషియన్స్ :
బ్యానర్ : ఐ క్యూ క్రియేషన్స్
నిర్మాత : బొడ్డు కోటేశ్వరరావు
దర్శకత్వం : శివనాగేశ్వరరావు
లైన్ ప్రొడ్యూసర్ : శ్యాం సన్
కెమెరా : గణేష్ ఆర్లి
మ్యూజిక్ : రోహిత్ వర్ధన్. కార్తీక్
పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్