HomeTeluguక్రిస్మస్ కానుకగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' ద రైజ్ విడుదల..

క్రిస్మస్ కానుకగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ ద రైజ్ విడుదల..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పదేళ్ళ తర్వాత వస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ రికార్డులను తిరగరాశాయి. తెలుగు ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని స్థాయిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-ద రైజ్ టీజర్ తో సరికొత్త చరిత్ర సృష్టించారు. పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా పార్ట్ 1 పుష్ప- ద రైజ్ విడుదల తేదీని ఇప్పుడు దర్శక నిర్మాతలు ఖరారు చేసారు. క్రిస్మస్ కానుకగా పుష్ప ఐదు భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా పుష్ప-ద రైజ్ థియేటర్లలో విడుదల కానున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.
ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఆగస్టు 13న ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. మిరోస్లా క్యూబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన

పుష్ప నటీ నటులు – సాంకేతిక నిపుణులు

నటీనటలు:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
రష్మిక మందన్న,
ఫహాద్ ఫాజిల్,
ధనుంజయ్,
సునీల్,
రావు రమేష్,
అజయ్ ఘోష్,
అనసూయ భరద్వాజ్ తదితరులు

టెక్నికల్ టీం:
దర్శకుడు: సుకుమార్
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా
సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్
లిరిసిస్ట్: చంద్రబోస్
క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్
మేకప్: నాని భారతి
CEO: చెర్రీ
కో డైరెక్టర్: విష్ణు
లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES