పుష్ప రాజ్ పరిచయ వేడుకలో సుకుమార్..

446

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని పుష్ప రాజ్ పాత్రను పరిచయం చేసే వేడుక జెఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు అర్జున్, సుకుమార్‌తో పాటు చిత్ర నిర్మాతలు నవీన్, రవి హాజరయ్యారు. వారితో పాటు అల్లు శిరీష్, ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సాన‌ ఈ వేడుకలో పాలు పంచుకున్నారు.

పుష్ప రాజ్ పరిచయ వేడుకలో అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ‘ఒక ఫ్యాన్‌గా చాలా సూపర్‌గా అనిపించింది. ఈ స్టేజీపైకి వచ్చి సినిమా గురించి మాట్లాడాలంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా మాత్రమే అర్హత ఉంది. కానీ ఇంతమంది గొప్ప వాళ్ల ముందు మాట్లాడటానికి ఇంకా కొన్ని రోజులు టైమ్ పడుతుంది. అది సాధించిన రోజు మా అన్నగురించి నేనే మాట్లాడతాను..’ అంటూ తెలిపారు.

పుష్ప రాజ్ పరిచయ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘సుకుమార్ గారూ నాకేం ఇచ్చినా మరిచిపోకుండా ఇస్తారు. ఆర్య సినిమాతోనే నాకు స్టైలిష్ స్టార్ బిరుదు వచ్చింది. ఆ సినిమాతోనే నా కెరీర్ ఫ్లై అయింది. ఇప్పుడు మళ్లీ నా కెరీర్‌కు మరిచిపోలేని గిఫ్ట్ పుష్ప రూపంలో ఇస్తున్నావ్.. థ్యాంక్స్ డార్లింగ్. నువ్వు స్టైలిష్ స్టార్ కాదు ఐకాన్ స్టార్ అంటూ బిరుదు ఇచ్చావు.. నాకెప్పుడు గుర్తుండి పోతుంది అది.. థ్యాంక్స్. పుష్ప.. ఈ సినిమా గురించి ఏం చెప్పాలి.. తగ్గేదేలే. ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు.. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు పడిపోయాను మళ్లీ లేచాను అప్పుడు నాకు నేను చెప్పుకున్న డైలాగ్ ఇదే. అమ్మాయిలు, అబ్బాయిలు అని కాదు అందరికీ తగ్గేదేలే అనుకోవాలి. ఎప్పుడూ సినిమా కానీ.. టీజర్ కానీ.. ట్రైలర్ కానీ అదిరిపోతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పలేను.. ఎందుకంటే నచ్చాల్సింది మీకు.. చింపాల్సింది మీరు.. మీకు నచ్చాలి. ఇతర భాషల ఆడియన్స్‌కు కూడా థ్యాంక్స్. రాబోయే పాన్ ఇండియన్ సినిమాలకు ఆల్ ది బెస్ట్. పుష్ప కూడా పాన్ ఇండియన్ సినిమానే. మా సినిమాలకు ఇంత మంచి ఆదరణ లభిస్తున్నందుకు థ్యాంక్స్. మైత్రి మూవీ మేకర్స్‌కు థ్యాంక్స్.. మీరు లేకపోతే ఈ సినిమా లేదు. సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీం.. దేవీ శ్రీ ప్రసాద్‌కు స్పెషల్ థ్యాంక్స్..’ అని తెలిపారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించబోతున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత స్టైలిష్ లేదనిపించింది. అందుకే ఆయన అన్నింట్లోనూ యూనిక్.. అందుకే ఆయన స్టైలిష్ స్టార్ కాదు ఐకాన్ స్టార్. బన్నీని ఆర్య అని పిలిచారు. కానీ ఈ సినిమా తర్వాత రెండే విషయాలు ఉంటాయి. ఒకటి ఐకాన్ స్టార్ లేదంటే పుష్ప అని పిలవాలి. మా నిర్మాతలకు థ్యాంక్స్.. వాళ్లు లేకపోతే సినిమా లేదు. సినిమాకు పని చేసిన టెక్నికల్ టీంకు థ్యాంక్స్. సినిమాటోగ్రఫీ కూబా అదరగొట్టాడు. పొరపాటున ఎవరినైనా మరిచిపోతే సారీ..’ అని తెలిపారు.

నటీనటులు :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (హీరో)
రష్మిక మందన్న (హీరోయిన్)
ఫహాద్ ఫాజిల్

సాంకేతిక నిపుణులు :
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సహ నిర్మాత – ముత్తంశెట్టి మీడియా
రచ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : సుకుమార్
ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై
కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్
స్టైలింగ్ : దీపాలి నూర్
ఆర్ట్ డైరెక్టర్: ఎస్.రామకృష్ణ , మౌనిక
సి.ఈ. ఓ: చెర్రీ
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కె.వి.వి
పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను – మ‌డూరి మధు

Eluru Sreenu
P.R.O