అఖిల్ అక్కినేని, సురేంద‌ర్ రెడ్డి, అనిల్ సుంక‌ర ప్ర‌స్టీజియ‌స్ మూవీ `ఏజెంట్`

420

విలక్షణమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటున్న‌యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన తరువాతి ప్రాజెక్ట్ ఇటీవ‌ల ‘సైరా’ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ సాధించిన స్టార్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డితో చేస్తున్నారు. ‌ తన హీరోలను బెస్ట్ స్టైలిష్ లుక్‌లో చూపించ‌డంలో స్పెషలిస్ట్ అయిన సురేంద‌ర్ రెడ్డి ఈ సినిమాలో అఖిల్‌ను స‌రికొత్త లుక్‌లో ప్ర‌జెంట్ చేయ‌బోతున్నారు.

అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు స‌రెండ‌ర్ 2 సినిమా ప‌తాకాల‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి, వ‌క్కంతం వంశీ కాంభినేష‌న్‌లో గతంలో `కిక్`, `రేసుగుర్రం` వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే కాగా వారిద్ద‌రి కలయికలో మరో బ్లాక్ బస్టర్ రూపొంద‌బోతుంది.

అఖిల్ హీరోగా న‌టిస్తోన్న 5వ చిత్రానికి `ఏజెంట్` టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేశారు మేక‌ర్స్.. ఈ రోజు యంగ్ హీరో అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా `ఏజెంట్` మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఈ సినిమా కోసం అఖిల్ పూర్తి న్యూ మేకోవ‌ర్ లో డాషింగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్లో గడ్డంతో స్టైలిష్ హెయిర్‌డోతో స‌రికొత్త‌గా ఉన్నారు. సిగరెట్ తాగుతున్న అఖిల్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. అఖిల్ తనను తాను ల‌వ‌ర్‌బాయ్ నుండి మాచోమేన్‌గా మార్చుకున్నారు. ఈ చిత్రంలో ఎన్నడూ చూడని స్టైలిష్ అవతార్ లో అఖిల్‌ను ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి ప్రజెంట్ చేశారు.

టైటిల్ డిజైన్‌లో సురేందర్ రెడ్డి మార్క్ క‌నిపిస్తోంది. మొత్తంమీద, ఏజెంట్ ఫస్ట్ లుక్ డిఫ‌రెంట్‌గా ఆకట్టుకుంటోంది. అఖిల్‌ లాంటి ప్రామిసింగ్ స్టార్ – సురేందర్ రెడ్డి వంటి ప్రూవ్ చేసుకున్న దర్శకుడు – వక్కంతం వంశీ లాంటి విభిన్న రచయిత మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ లాంటి సక్సెస్ ఫుల్ బ్యానర్ లో నిర్మాణం జరుపుకుంటున్నఈ చిత్రం ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.

స్పై థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచ‌యం కాబోతుంది.

టాలీవుడ్ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండ‌గా, రాగూల్ హెరియన్ ధారుమాన్ సినిమాటోగ్ర‌ఫి భాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలీ ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

అజ‌య్ సుంక‌ర‌, ప‌త్తి దీపారెడ్డి కో- ప్రొడ్యూస‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌ 11 నుండి ప్రారంభం కానుంది. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ తో పాటు 2021 డిసెంబర్ 24న ‘ఏజెంట్’ చిత్రాన్ని విడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేకర్స్.

అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
క‌థ‌: వ‌క్కంతం వంశీ,
సినిమాటోగ్ర‌ఫి: రాగూల్ హెరియన్ ధారుమాన్,
సంగీతం: త‌మ‌న్ ఎస్‌.ఎస్‌,
ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి,
ఆర్ట్‌: అవినాష్ కొల్లా,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గ‌రికిపాటి,
కో- ప్రొడ్యూస‌ర్స్‌: అజ‌య్ సుంక‌ర‌, ప‌త్తిదీపా రెడ్డి,
నిర్మాత‌: రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌,
ద‌ర్శ‌క‌త్వం: సురేంద‌ర్ రెడ్డి.