విడుదలకు సిద్ధమవుతున్న ”కళాపోషకులు”*

493

శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కబోతున్న సినిమా కళాపోషకులు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి అయ్యాయి. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. ఆ నలుగురు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం విశేషం.

ఈ సందర్భంగా నిర్మాత ఏమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ…
‘కళాపోషకులు’ చిత్రాన్ని దర్శకుడు చలపతి పువ్వుల బాగా తెరకెక్కించాడు. మహావీర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతొంది. నటీనటులు అందరూ బాగా చేశారు. కోవిడ్ 19 లాక్ డౌన్ తరవాత ప్రభుత్వ సూచనలు, చిత్రసీమ పెద్దల సలహాలు పాటిస్తూ చిత్రీకరణ మొదలు పెట్టీ ఎటువంటి ఇబ్బందులు,లేకుండా దిగ్విజయంగా సెరవేగంగా షూటింగ్ జరుపుకున్న కళ పోషకులు సినిమాకి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్వాదాలు తెలిపారు.

డైరెక్టర్ చలపతి పువ్వల మాట్లాడుతూ…
నిర్మాత సుధాకర్ రెడ్డి గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. హీరో విశ్వ కార్తికేయ బాగా చేశాడు, సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. కల్యాణ్ సమి కెమెరా వర్క్, ఎలెందర్ మహావీర్ మ్యూజిక్ సినిమాకు అదనవు ఆకర్షణ కానున్నాయని తెలిపారు.

బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్
నటీనటులు: విశ్వకార్తికేయ, దీప ఉమాపతి, చైతన్య, చిన్ను
కృష్ణ వేణి, అనంత్,జెమిని సురేష్,నవీన్ సంతోష్,మహేష్ తదితరులు
కెమెరామెన్: కళ్యాణ్ సమి
ఎడిటర్: సెల్వ కుమార్
సంగీతం: ఎలేందర్ మహావీర్
డిజైన్: గణేష్
పీఆర్ఓ: సాయి సతీష్
నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎమ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: చలపతి పువ్వల