సంతోష ఆంజనేయులు సమర్పణలో శ్రీలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై రాజ్, షాలు హీరోహీరోయిన్లుగా ఆది అరవల దర్శకత్వంలో కావాలిరాజు నిర్మించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రణస్థలం”.ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా నేడు హైదరాబాద్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కావలి రాజు, దర్శకుడు ఆది అరవల , సంగీత దర్శకుడు రాజకీరణ్, కెమెరా మెన్ ప్రభాకర్, లిరిక్ రైటర్ రామారావు,కో డైరెక్టర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ” ఈ సినిమా “మా ప్రాంతం వారు తీసినందుకు గర్వపడుతున్నాను.ప్రొడ్యూసర్ రాజు చిన్న స్టేజ్ నుండి ఈ రోజున సినిమాలు నిర్మించే స్థాయి కి ఎదగడం సంతోషం గా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు.చిత్ర దర్శకుడు ఆది అరవల మాట్లాడుతూ ‘ఈ సినిమా కి కథే హీరో. మంచి కథతో ముందుకు వెళ్ళాం. చక్కటి అవుట్ ఫుట్ తో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు.చిత్ర నిర్మాత కావాలి రాజు మాట్లాడుతూ’ మా సినిమా ఫస్ట్ లుక్ ను మంచి మనసున్న మా మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు రిలీజ్ చేయడం ఆనందం గా ఉంది. ఈ సందర్భంగా మా సబితమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.’అన్నారు. ఈ సినిమా ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్ గా తెరకెక్కించాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఫైనల్ స్టేజ్ లో ఉంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నాం’అన్నారు. రాజ్, షాలు, సత్యంరాజేశ్, ఛత్రపతి శేఖర్, రాగిణి, జబర్దస్త్ అప్పారావు, చిత్రం శ్రీను, మేఘన తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:రాజకీరణ్, కెమెరా:ప్రభాకర్, ఎడిటర్:ఎమ్ ఆర్ వర్మ, లిరిక్స్:ఎం.రామారావు, ఫైట్స్:డ్రాగన్ ప్రకాష్, వించున్ అంజి, డాన్సు:పాల్ ,విగ్నేష్, ఆర్ట్:సుభాష్ నాని పి.ఆర్. ఓ:బి.వీరబాబు, నిర్మాత:కావాలి రాజు, కధ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఆది అరవల