ప్రపంచవ్యాప్తంగా మే 29న గ్రాండ్ గా విడుదలవుతున్న ఆకాష్ పూరి ‘రొమాంటిక్’

511

‘రొమాంటిక్’ మూవీతో తనయుడు ఆకాష్ పూరి కి బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. సినిమా ప్రొడక్షన్ స్టార్టయిన దగ్గర్నుంచి మంచి ప్రచార వ్యూహాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీని సైతం తనదైన శైలిలో అనౌన్స్ చేశారు.
మే 29న ప్రపంచవ్యాప్తంగా ‘రొమాంటిక్’ను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ లో మంచి వినోదంతో కాలక్షేపాన్ని ఆశించేవాళ్లకు ఈ సినిమా అలాంటి కాలక్షేపాన్ని ఇస్తుందని చిత్ర బృందం చెబుతోంది. హీరోయిన్ కేతికా శర్మతో హీరో ఆకాష్ లిప్ లాక్ చేస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్ర చేస్తున్న ఈ మూవీని అనిల్ పాడూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రెండు పాటలూ సంగీత ప్రియులను అలరిస్తూ చార్ట్ బస్టర్స్ గా పేరు తెచ్చుకున్నాయి. నరేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.