“టూరింగ్ టాకీస్” ఇది మరో గుంటూరు టాకీస్.

1465

ఎంటర్ టైన్మెంట్ ప్లస్ పతాకం పై బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ ప్రధాన పాత్రలో రాబోతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “టూరింగ్ టాకీస్”. విజయ్ పెద్దిరెడ్డి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రంగనాధ్ ముత్యాల దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఏ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రంగనాధ్ ముత్యాల మాట్లాడుతూ”గుంటూరు టాకీస్ తరహ లొనే ఇదొక వెరైటీ రొమాంటిక్ ఎంటర్ టైనర్.యూత్ ని ఎట్రాక్ట్ చేసే అద్భుతమైన పాటలు,ప్రేక్షకులను ఆకట్టుకునే వైవిధ్యమైన కామెడీ మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ.అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా వెరైటీ గా ప్లాన్ చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మాచిత్రాన్ని వేసవికానుకగా విడుదల చేయలనుకుంటున్నాం.”అన్నారు.
భానుశ్రీ,విజయ్ పెద్దిరెడ్డి,మగదీర సంపత్ రాజ్,జబర్దస్త్ చిట్టిబాబు,గుండు మురళి,అర్జునరెడ్డి.బి,గోపి యాదవ్ పవులూరి,ప్రాణాళి రెడ్డి,శ్రీకళ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఉమ మహేష్ బెరి,డి.ఓ.పి:ఎన్.డి.ఉదయ్,డైలాగ్ :శివ కాకు,ఆర్ట్:సందీప్.టి,తోట రామకృష్ణ, ప్రొడక్షన్ మేనేజర్:రామకృష్ణ,ఎడిటింగ్:కార్తిక్. కట్స్,పి.అర్. ఓ:బాసింశెట్టి వీరబాబు, ప్రొడ్యూసర్: ప్రేమ్ నాధ్ ముత్యాల, స్టోరీ, స్క్రీన్ ప్లే ,డైరెక్షన్:రంగనాధ్ ముత్యాల.