యండమూరి “అతడు ఆమె ప్రియుడు” టీజర్ ఆవిష్కరించిన మంత్రి అవంతి శ్రీనివాస్

311

ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో… రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ విభిన్న కథా చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమైంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం వైజాగ్-అవంతి కాలేజీలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
మంత్రివర్యులు-అవంతి సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా హాజరై టీజర్ ఆవిష్కరించి “అతడు ఆమె ప్రియుడు” అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్ కు కథలు అందించిన తాను ఆయనకు పెద్ద ఫ్యాన్ అని ఈ సందర్భంగా యండమూరి పేర్కొన్నారు. నిర్మాతలు రవి కనగాల-తుమ్మలపల్లి రామ్ ఖర్చుకు వెనకాడకుండా “అతడు ఆమె ప్రియుడు” చిత్రాన్ని నిర్మించారని తెలిపారు.
ప్రఖ్యాత దర్శకులు కె.రాఘవేంద్రరావు విడుదల చేసిన “అతడు ఆమె ప్రియుడు” ఫస్ట్ లుక్ కి అనూహ్య స్పందన లభించిందని, మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు రిలీజ్ చేసిన టీజర్ కు కచ్చితంగా మరింత మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉందని నిర్మాతలు రవి కనగాల-తుమ్మలపల్లి రామ్ పేర్కొన్నారు. యండమూరి వంటి లెజెండ్ దర్శకత్వంలో నటించే అవకాశం లభించడం పట్ల కౌశల్ (బిగ్ బాస్ ఫేమ్), హీరోయిన్ మహేశ్వరి, నటుడు భూషణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఈ వేడుకలో డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు!!
అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్, సమర్పణ: శ్రీమతి కూనం కృష్ణకుమారి, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్!!