వచ్చే యేడాది మిమ్మల్ని తప్పకుండా అలరిస్తాను.. బర్త్ డే వేడుకల్లో హీరో ఆది

745

హీరోల లైఫ్ లో ఫ్యాన్స్ కూడా ఫ్యామిలీ అయిపోతారు.. అందుకే తన బర్త్ డే వేడుకల్ని ఫాన్స్ తో సెలబ్రేట్ చేసుకున్నాడు హీరో ఆది. ఫాన్స్ మద్యలో సెలబ్రేట్ చేసుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ఫాన్స్ తో జరిగిన బర్త్ డే వేడుకల్లో తన రాబోయే చిత్రాల విశేషాలను పంచుకున్నాడు.

ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ: ‘ఒక సాలిడ్ హిట్ వచ్చినప్పుడే ఫాన్స్ ని కలుద్దాం అనుకునే వాడిని, కానీ జయాపజయాలకంటే ఫాన్స్ ని కలవడం చాలా ముఖ్యం అనుకొని ఈ వేడుకలకు వచ్చాను. నామీద మీరు చూపిస్తున్న అభిమానం చాలా గొప్పది, నాకు ఒక సపోర్ట్ గా నిలుస్తుంది. వచ్చే యేడాది మీ అందరినీ అలరించే సినిమాలతో రాబోతున్నాను. శశి అని సినిమా రాబోతుంది అది ఒక లవ్ స్టోరీ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. అలాగే ఒక థ్రిల్లర్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం డాక్టర్ గా కనిపిస్తున్నాను ఈరోజు రిలీజ్ అయిన లుక్ కి చాలా మంచి రెస్సాన్స్ వచ్చింది . చాలా సీరియస్ గా ఉండే థ్రిల్లర్. మంచి కంటెంట్ ఉన్న కథలు ఓకే చేసాను. తప్పకుండా మిమ్మల్ని ఆనందింపజేసే సినిమాలు తో వస్తాను. నాకోసం మీరంతా ఇక్కడికి వచ్చి నా బర్త్ డే ని మరింత మెమరబుల్ చేసారు. మీరు చూపిస్తున్న అభిమానానికి నా థ్యాంక్స్ ’’ అన్నారు.

హీరో సాయి కుమార్ మాట్లాడుతూ:
‘‘ ఆది నటుడు అవుతాడని అనుకోలేదు..క్రికెట్ లో చాలా బాగా రాణిస్తాడనుకున్నాను. ఏదైనా మ్యాచ్ లు చూస్తుంటే అతను ఆ రేంజ్ లో ఉండే వాడు అనిపిస్తుంటుంది. మాలో ఉన్న స్వరం మా నాన్నగారిది , సంస్కారం అమ్మది, ఆశీర్వాదం భగవంతుడుది, అభిమానం మీది. మానాన్నగారు సాధించిన దాని కంటే కాస్త ఎక్కవు నేను సాధించి ఉండవచ్చు. కానీ ఆది అంతకు మించి ఎదుగుతాడనే నమ్మకం ఉంది. వచ్చే యేడాది అతను మంచి సినిమాలతో మిమ్మల్ని అలరిస్తాడని నమ్ముతున్నాను. మేము ప్రయత్నం లో త్రికరణశుద్దిగా ఉన్నాం.. ఫలితం అనేది మీ చేతుల్లో ఉంది. కానీ ఆది ఎంచుకున్న కథలు వాటి లుక్స్ కొన్ని చూపించాడు చాలా షాకింగ్ అనిపించాయి. తప్పకుండా మిమ్మల్ని ఆనంద పరుస్తాయి అలరిస్తాయి అని నమ్ముతున్నాను’’ అన్నారు