కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై 15 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తూ వరుస సినిమాలతో అదరగొడుతుంది ఈ అందాల చందమామ. ప్రస్తుతం విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది .ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ చెప్పిన విషయాలు..
– ‘మోసగాళ్ళు’ లాంటి సినిమాను నా కెరీర్‌లో ఇప్పటివరకు చేయలేదు. నా రెగ్యులర్ కమర్షియల్ రోల్స్ కాకుండా అను వంటి ఓ డిఫరెంట్ రోల్ చేయడం సంతోషంగా ఉంది. అదేవిధంగా ఛాలెంజింగ్‌గా అనిపించింది.
– దర్శకుడు జెఫ్రి కథ విన్నప్పుడే నాకు నచ్చింది. ముంబైలో ఉన్న అక్కాతమ్ముడు అమెరికాలో ఎలా స్కామ్ చేస్తారు? అనే విషయాన్ని వెండితెరపై చూసినప్పుడు తప్పకుండా ఆడియన్స్ థ్రిల్ అవుతారు. అను క్యారెక్టర్‌ను ఏంజాయ్ చేస్తూ చేశాను.
– కథ నచ్చే ఈ సినిమాలో మంచు విష్ణు హీరో పాత్రకు అక్క పాత్ర చేశాను. ఈ ఎంటైర్ స్కామ్‌లో మాస్టర్ మైండ్ అనుదే. మనం ఇద్దరం అక్కాతమ్ముడిగా చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా?అని మంచు విష్ణును అడిగాను. డైరెక్టర్ విజన్‌ను నమ్మి చేద్దాం. వర్కౌట్ అవుతుందని విష్ణు అన్నారు. అలా ‘మోసగాళ్ళు’ సినిమాను స్టార్ట్ చేశాం. కథ ప్రకారం నా పాత్రకు సినిమాలో లవ్‌ట్రాక్ లేదు. ఈ సినిమాలో అను పాత్రకు యాక్షన్ సీన్స్ లేవు. సునీల్‌శెట్టిగారితో సీన్స్ లేవు. నవదీప్, నవీన్ చంద్రలతో కొన్ని సీన్స్ ఉన్నాయి.
– నేను ఇంకా ‘మోసగాళ్ళు’ సినిమా చూడలేదు. కానీ లెజండరీ యాక్టర్ మోహన్‌బాబుగారు ఈ సినిమాను
చూసి భావోద్వేగానికి లోనైయ్యారని చెబుతున్నారు. అంత గొప్ప నటులు మోహన్ బాబుసార్‌కి సినిమా నచ్చినందుకుచాలా సంతోషంగా ఉంది.
–‘మోసగాళ్ళు’ సినిమాకు మంచు విష్ణు నిర్మాత కూడా. కానీ విష్ణు ఒకసారిసెట్స్‌లోకి వచ్చాడంటే యాక్టర్‌గా మారిపోతాడు. నిర్మాతగా మాట్లాడడు. ఈ సినిమా నిర్మాణ విలువలు కూడ బాగుంటాయి. రియలిస్టిక్, లైవ్ లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. ముంబై మురికివాడల్లో కూడ మోసగాళ్ళు సినిమా షూటింగ్ జరిగింది.
– ఈ సినిమాను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో షూట్ చేశాం. కన్నడ, మలయాలం, తమిళం భాషల్లో విడుదల చేస్తున్నాం. ప్యాన్ ఇండియా స్థాయిలో నా సినిమాలు కొన్ని ఇంతకుముందే విడుదల అయ్యాయి. మన సినిమాలకు వైడ్ రేంజ్ ఉండి ఎక్కువమంది ఆడియన్స్‌కు రీచ్ అయితే మంచిదే కదా! ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్‌కు నా వాయిస్ ఇచ్చాను.
–హాలీవుడ్ దర్శకుడు జెఫ్రితో వర్క్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. ఇక్కడ ఫ్రేమ్ టు ఫ్రేమ్ సీన్స్‌ను షూట్ చేస్తే, జెఫ్రీ మాత్రం పెద్ద సీన్‌ను ఒకేసారి షూట్ చేయాలని అనేవారు. అలాగే తీశాం. ఇంకో విషయం ఏంటేంటే…ఒకసారి ఇంగ్లీష్‌లో తీసిన సన్నివేశాన్ని మళ్లీ తెలుగులో షూట్ చేయాలి. కొంచెం కష్టంగా అని పించిన మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది.
– చిరంజీవిగారితో ‘ఆచార్య’ చేస్తున్నాను. నాగ్‌సర్‌తో ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయబోతున్నాను. ‘ఘోస్టీ’ అనే తమిళ సినిమాతో పాటు మరో తమిళ సినిమా చేస్తున్నాను. ‘ఇండియన్ 2’ సినిమా ప్రస్తుతం ఆగిపోయింది. నేను చేసిన లైవ్‌టెలీకాస్ట్ వెబ్‌సిరీస్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. ఆలస్యంగా విడుదలచేయడమే దానికి కారణం అనుకుంటున్నాను. నెక్ట్స్ టైమ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. వెబ్‌సిరీస్‌లు చేసే ఆలోచన ఉంది. కథలు కదరాలి. నేను హోస్ట్‌గా ఓ షో ఉండొచ్చు. ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను.
– కరోనా వల్ల ఏడాది ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌లో కొన్ని ఇంటి పనులు, వంటకాలు, ఆన్‌లైన్ క్లాసులు వంటివి తీసుకున్నాను. కానీ సినిమాలు చేయలేదు. ఇప్పుడు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. వివాహం చేసుకున్న వారం తర్వాత వెంటనే షూటింగ్‌లో పాల్గొన్నాను.