HomeTeluguఘనంగా జ‌రిగిన `శ‌శి` ప్రీ రిలీజ్ ఈవెంట్‌...

ఘనంగా జ‌రిగిన `శ‌శి` ప్రీ రిలీజ్ ఈవెంట్‌…


ఆది సాయికుమార్ హీరోగా శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శ‌శి’. సుర‌భి నాయిక‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్‌.పి. వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 19న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్‌లో ఘ‌నంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు వెర్స‌టైల్ హీరో రానా దగ్గుబాటి, యంగ్ హీరోస్ నాగశౌర్య, సందీప్ కిషన్‌, విశ్వక్ సేన్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో సురభి, రాశీ సింగ్, సాయి కుమార్, చంద్రబోస్, అనంత్ శ్రీరామ్, భాస్కర భట్ల తదితరులు పాల్గొన్నారు.

భాస్కరభట్ల మాట్లాడుతూ.. ‘దీంతానా దీంతానా అనే పాటను రాశాను.. నాకు సాయి కుమార్, ఆది ఇద్దరూ కూడా మిత్రులు. ఇద్దరూ కూడా భయ్యా అని పిలుస్తుంటారు. ప్రతీ రోజూ పాట ఎన్ని మిలియన్లు క్రాస్ చేసిందనే అప్డేట్లు ఇస్తుంటాడు. నా పాట హిట్ అవ్వడంతో ఆది చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు

అన్నీ కలిసి వచ్చాయ్..సందీప్ కిషన్ మాట్లాడుతూ.. హీరో ఆదికి అన్నీ కలిసి వచ్చాయ్. టీజర్‌ను చిరంజీవి గారు ట్రైలర్‌ను కళ్యాణ్ గారు విడుదల చేశారు. సిధ్ శ్రీరామ్ పాడిన పాట సూపర్ హిట్ అయింది. అన్నీ కలిసి వచ్చాయ్.. ఈ సినిమాలో సురభి అందంగా కనిపించింది.. శశి టీంకు ఆల్ ది బెస్ట్. మార్చి 19న అందరూ శశి సినిమాను చూడండి’ అన్నారు.

ఆ విజయ పరంపరలో శశి కూడా చేరాలి..
రానా మాట్లాడుతూ.. ‘ నేను ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం సాయి కుమార్ గారు. ఇప్పుడు అందరికీ ఆన్ లైన్ క్లాసులు తెలుస్తున్నాయ్. కానీ నాకు మాత్రం నా మొదటి చిత్రం నుంచి ఆన్ లైన్ క్లాసులున్నాయ్.. నా ఆన్ లైన్ క్లాసులు సాయి కుమార్ గారివే. ఆయ‌న పిలిచిన నిమిషం నేను వచ్చేయాలి.. వేరే దారి లేదు. ఈ ఏడాది ఇండియన్ సినిమాను మొదలుపెట్టేసింది టాలీవుడ్. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ విజయ పరంపరలో శశి కూడా చేరాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆది కి ఈ మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలి.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మార్చి 19న మాస్కులు వేసుకుని థియేటర్‌కు వెళ్లండి.. శ‌శి సినిమాని ఎంజాయ్ చేయండి“ అన్నారు.

ఆది మాట్లాడుతూ – ‘తెలుగు ఇండస్ట్రీ రికవరీ అయింది ప్రేక్షకుల వల్లే. నా బర్త్ డే నాడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మ్యాచోగా ఉన్నావ్ అని చిరంజీవిగారు అన్నారు. అలా చెప్పడంతో హ్యాపీగా అనిపించింది. చిన్నప్పటి నుంచి నేను అమితంగా ఇష్టపడే వ్యక్తి ఆయన. తమన్, హరీష్ శంకర్, నాని నా పాటలను రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను పవన్ కళ్యాణ్‌ గారు విడుదల చేయడం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. అందరు హీరోల అభిమానుల సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంది. ఈ కార్య‌క్ర‌మానికి అతిథులుగా వచ్చిన హీరోలందరికీ థ్యాంక్స్. డైరెక్టర్ శ్రీనివాస్ వచ్చి కథ చెప్పినప్పుడు ఎంతో ఎగ్జైట్ అయ్యాను. డీఓపీ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కెరీర్ బెస్ట్ సాంగ్ ఇచ్చిన అరుణ్‌కు థ్యాంక్స్. నాకు ఫస్ట్ టైం చంద్రబోస్ రాసిన ఈ పాట ఇంత సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. శశి కోసం పని చేసిన అందరికీ థ్యాంక్స్. మార్చి 19న ఈ మూవీ రాబోతోంది. అందరూ చూడండి’ అన్నారు.

బొమ్మ వేరేలా ఉంటుంది
చిత్ర దర్శకుడు శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ.. ‘జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను.. ఒక వేదిక కావాలి.. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే.. ఆరుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. వారి గురించి జీవితాంతం రుణపడి ఉంటాను.. శశి మా నిర్మాత మొండి పట్టుదల. ఎక్కవఖర్చు పెట్టి ఈ సినిమాను ఇలా తీసుకున్నారు.. సినిమాలు ఆడొచ్చు ఆడకపోవచ్చు.. సక్సెస్ వస్తదో.. ఫెయిల్ అవుతుందో తెలీదు కానీ చెడ్డపేరు రాకుండా సినిమా తీయాలనే మాట చెప్పారు. అది ఎప్పటికీ మరిచిపోలేను. టీజర్ రిలీజ్ చేసి చిరంజీవి గారు చిన్న పుష్ ఇచ్చారు.. పవన్ కళ్యాణ్ ట్రైలర్ రిలీజ్ చేసి పెద్ద హైప్ ఇచ్చారు. సినిమాకు ఇంత పాపులారటీ వచ్చిందంటే కేవలం చంద్రబోస్ గారి వల్లే. పాటల రచయితలందరికి థ్యాంక్స్. ఈ సినిమాకు నలుగురు పిల్లర్స్. అమర్ భయ్య ఫోటోగ్రఫీ.. సత్యజీ ఎడిటింగ్.. అరుణ్ మ్యూజిక్.. రవి డైలాగ్స్ అదిరిపోయాయి. చిత్రానికి పనిచేసిన అందరికీ థ్యాంక్స్. ఇప్పటి వరకు మీరు ఆదిని చూశారు.. బొమ్మ వేరేలా ఉంటుంది. మిగతా వారి గురించి సక్సెస్ మీట్‌లో మాట్లాడతాను’ అని అన్నారు.

 

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES