సామాన్యుడి జీవితకథ!

512

 

సమాజంలో ప్రముఖ వ్యక్తుల నిజ జీవితకథలను బయోపిక్‌లుగా వెండితెరపై ఆవిష్కరించడం ఇప్పటి వరకు చూశాం. అయితే ఇందుకు భిన్నంగా తొలిసారిగా ఓ సామాన్యుడి బయోపిక్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు మనుయజ్ఞ. ప్రస్తుతం హీరో సుమంత్‌తో అనగనగా ఒక రౌడీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మనుయజ్ఞ. ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఊరికి, ఇంటివాళ్లకి తలనొప్పిగా మారిన ఓ పచ్చి తాగుబోతు..ఒక సమయంలో రియలైజ్ అయ్యి ఒక సక్సెస్‌ఫుల్ పారిశ్రామిక వేత్తగా ఎదిగి.. ఆ సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి నలుగురికి ఎలా ఆదర్శప్రాయం నిలిచాడు అనేది కథ.మురళి కున్నుం పురత్ అనే సామాన్య వ్యక్తి జీవితంలోని యదార్థ సంఘటనలతో, ఆయన నిజజీవిత కథతో అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు.డబ్ల్యూఎమ్ మూవీస్ పతాకంపై నిర్మాణం కానున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కేఎమ్ రాజీవ్   

PRO ; MADURI MADHU