రెబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. పాన్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అన్ని భాషలలో కూడా రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మోషన్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి14 విడుదలైన రాధే శ్యామ్ రొమాంటిక్ గ్లిమ్ప్స్ కి ప్రేక్షకనీరాజనం లభించింది. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల్ని సర్ ప్రైజ్ చేస్తూ రాధేశ్యామ్ చిత్రం నుంచి ఓ రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేశారు. పూర్తిగా మంచు బ్యాక్ డ్రాప్ లో రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజాహెగ్దే లు కలిసి ఉన్న ఈ పోస్టర్ ఈ సినిమా పై రెబల్ స్టార్ అభిమానులకి ఉన్న అంచనాల్ని మరింత రెట్టింపు చేసేలా ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ తో ఈసారి రొమాంటిక్ టచ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అనే విషయం మరోసారి ఈ శివరాత్రి స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడైంది. రెబల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్రమోద్, ప్రసీధలు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, కన్నడ, తమిళ, మళయాలీ వెర్షన్స్ కు సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. జూలై 30న ఏకకాలంలో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మళయాలం భాషల్లో రాధేశ్యామ్ భారీ రేంజ్ లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే..
టెక్నికల్ టీమ్:
దర్శకుడు: రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్
ప్రొడక్షన్ డిజైనర్ – రవీందర్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
డిఓపి – మనోజ్ పరమహంస
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వరరావు
డైరెక్టర్ ఆఫ్ కొరియోగ్రఫి – వైభవి మర్చెంట్
యాక్షన్ కొరియోగ్రఫి – నిక్ పో వెల్
సౌండ్ ఇంజనీర్ – రసూల్ పూకుట్టి
—
Thanks & Regards,
Eluru Sreenu
P.R.O